MLA Burra Madhusudan Yadav: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం కాకరేపుతోంది.. కొందరు ఇతర పార్టీల నేతలతో టచ్‌లోకి వెళ్తున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో, ఈ సారి టికెట్ దక్కనివారు పార్టీలో ఉంటారు..? పక్కను చూస్తున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ పై కూడా ఈ తరహా ప్రచారం సాగుతోంది. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఈ ప్రచారంపై స్పందించారు. నేను పార్టీ మారుతున్నాను అని నా పై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా నన్ను ఎమ్మెల్యేను చేశారు.. నేను జీవితాంతం వైఎస్ జగన్ తోనే ఉంటాను అని స్పష్టం చేశారు.
Read Also: Vishwambhara: ఇట్స్ అఫీషియల్.. చిరంజీవి ‘విశ్వంభర’ వచ్చేది ఎప్పుడంటే!
ఇక, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవం, వైఎస్ జగన్ నా రాజకీయ దైవం అని వెల్లడించారు బుర్రా మధుసూధన్ యాదవ్.. పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో నాకు అనుబంధం ఉంది.. అందుకే నాకు టికెట్ రాకపోవడంతో కొంత బాధ పడ్డారని తెలిపారు.. ఇక, పార్టీ అధిష్టానం నియమించిన కొత్త ఇంఛార్జ్ నారాయణ యాదవ్ కు పూర్తి సహకారం అందిస్తాను అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లోనూ కనిగిరి కోటపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్.