NTV Telugu Site icon

Kanguva Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘కంగువా’ కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Kanguva Release Date

Kanguva Release Date

Kanguva Release Date: కోలీవుడ్‌ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ తెరకెక్కించిన సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘వేట్టయ్యన్‌’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నేడు కంగువా కొత్త రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

కంగువా చిత్రాన్ని నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో తెలిపింది. ‘ది బ్యాటిల్ ఆఫ్ ప్రైడ్ అండ్ గ్లోరీ, ఫర్ ది వరల్డ్ టు విట్‌నెస్. కంగువ తుఫాన్ నవంబర్‌ 14 నుంచి మొదలవుతుంది’ అని స్టూడియో గ్రీన్‌ ఎక్స్‌లో పేర్కొంది. విషయం తెలిసిన సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 10న అనుకున్న సినిమాను దాదాపు నెల ఆలస్యంగా.. నవంబర్‌ 14న విడుదల చేస్తున్నారు.

Also Read: Aishwarya Rai: ‘సూపర్‌ స్టార్‌’ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. వీడియో వైరల్!

కంగువా ద్వారా బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీలు కోలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. కిచ్చా సుదీప్‌, యోగిబాబు, జగపతిబాబు, నటరాజన్ సుబ్రమణ్యంలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదటిసారి తమిళంలో నిర్మిస్తున్న మూవీ కావడంతో మన దగ్గర కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Show comments