Kanguva Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘కంగువా’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కంగువా రిలీజ్ డేట్ వచ్చేసింది
- నెల ఆలస్యంగా విడుదల
- తెలుగులో కూడా భారీ అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanguva Release Date: కోలీవుడ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ తెరకెక్కించిన సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయ్యన్’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నేడు కంగువా కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
కంగువా చిత్రాన్ని నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో తెలిపింది. ‘ది బ్యాటిల్ ఆఫ్ ప్రైడ్ అండ్ గ్లోరీ, ఫర్ ది వరల్డ్ టు విట్‌నెస్. కంగువ తుఫాన్ నవంబర్ 14 నుంచి మొదలవుతుంది’ అని స్టూడియో గ్రీన్ ఎక్స్‌లో పేర్కొంది. విషయం తెలిసిన సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 10న అనుకున్న సినిమాను దాదాపు నెల ఆలస్యంగా.. నవంబర్ 14న విడుదల చేస్తున్నారు.
Also Read
Also Read: Aishwarya Rai: ‘సూపర్ స్టార్’ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. వీడియో వైరల్!
కంగువా ద్వారా బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీలు కోలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. కిచ్చా సుదీప్, యోగిబాబు, జగపతిబాబు, నటరాజన్ సుబ్రమణ్యంలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదటిసారి తమిళంలో నిర్మిస్తున్న మూవీ కావడంతో మన దగ్గర కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
The Battle of Pride and Glory, for the World to Witness ⚔🔥#Kanguva‘s mighty reign storms screens from 14-11-24 🤎#KanguvaFromNov14 🦅 @Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP #StudioGreen @GnanavelrajaKe @vetrivisuals @supremesundar @UV_Creations… pic.twitter.com/de3yYAL0BI
— Studio Green (@StudioGreen2) September 19, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!