నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) నేత సిమ్‌రంజిత్ సింగ్ మాన్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ ఎంపీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు దీనిపై కంగనా రనౌత్ ప్రకటన కూడా బయటకు వచ్చింది. అకాలీదళ్ నేతపై ఎదురుదాడికి దిగిన ఆమె.. అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైందని ఎక్స్ లో పేర్కొన్నారు.
READ MORE: Andhra Pradesh: మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం
నిజానికి, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. కంగనా రైతుల ఉద్యమం సమయంలో అత్యాచారం, హత్య ఆరోపణలు చేశారు. దీనిపై మీడియా అకాలీదళ్ నేత సిమ్‌రంజిత్ సింగ్ మాన్‌ని ప్రశ్నించగా.. ‘నేను చెప్పక్కర్లేదు. కానీ రనౌత్ సాహెబ్‌కు రేప్‌లో చాలా అనుభవం ఉంది. రేప్‌లు ఎలా జరుగుతాయో ప్రజలు ఆమెను అడగవచ్చు.” అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కంగానా రనౌత్ తన ఎక్స్ ఖాతాలో.. “ఈ దేశంలో అత్యాచారాలను చిన్నచూపు చూడటం ఎప్పటికీ ఆగదని అనిపిస్తోంది. ఈరోజు ఈ సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చాడు. ఆడవాళ్ళపై అత్యాచారాలు, హింసలు సరదా కోసం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పితృస్వామ్య దేశం యొక్క మనస్తత్వం వారిలో చాలా లోతుగా పాతుకుపోయింది. ఇది ఉన్నత స్థాయి చిత్రనిర్మాత లేదా రాజకీయ నాయకుడైనప్పటికీ.. స్త్రీలను ఆటపట్టించడం లేదా ఎగతాళి చేయడం వంటివి చేసేవారు.” అని రాసుకొచ్చారు.
READ MORE:Haj Yatra 2025: వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో కొత్త నిబంధనలు.. అవెంటంటే..?
కాగా.. ఇటీవల రైతుల ఉద్యమంపై కంగానా సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగనా తీరుపై ప్రతిపక్షాలు మండిపడడంతో పాటు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఆమెపై పంజాబ్ మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) నేత సిమ్రాన్‌జీత్‌సింగ్ మాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కంగనాపై ఈ సందర్భంగా మాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిని పంజాబ్ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. మహిళను అవమానించినట్లేనని.. తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
