Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Kangana Ranaut Protest Against The Rs 272 Crore Project For Which Gadkari Laid The Foundation Bijli Mahadev Ntc Rpti

Kangana Ranaut: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్!

Published Date :September 27, 2024 , 4:58 pm
By RAMAKRISHNA KENCHE
  • కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన కంగనా
  • రూ. 272 కోట్ల ప్రాజెక్ట్ ను ఆపాలని మంత్రిని కలవనున్నట్లు స్పష్టం
  • అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్
Kangana Ranaut: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుపై
సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల క్రితం, హిమాచల్ ప్రదేశ్‌లోని కులులోని ఖరహల్ వ్యాలీలో బిజిలీ మహాదేవ్ రోప్‌వేను నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే ఇప్పుడు కంగనా రనౌత్ 272 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించడం ప్రారంభించారు. వాస్తవానికి.. బిజిలీ మహాదేవ్ రోప్‌వేకు వ్యతిరేకంగా గ్రామస్థులు అనేక నిరసనలు చేపట్టారు. రోప్‌వే నిర్మాణం వల్ల వారి ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రోప్‌వే నిర్మాణంలో అనేక చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని తెలుపుతున్నారు.

READ MORE: YS Jagan: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు

ఈ ప్రాజెక్ట్ విషయంలో తాను నితిన్ గడ్కరీని కలిసినట్లు కంగనా రనౌత్ తెలిపారు. ఈ విషయమై వారికి సమాచారం అందించినట్లు చెప్పారు. ప్రాజెక్టును నిలిపేంసేందకు మళ్లీ ఒక సారి నితిన్ గడ్కరీని కలుస్తున్నట్లు స్పష్టం చేశారు. తమకు ఆధునికీకరణ కంటే తమ దేవుని ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవని ఆమె తెలిపారు.

READ MORE: Vikas Divyakirti: స్త్రీగా జీవించడం ఎందుకు కష్టం?: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

నితిన్ గడ్కరీ శంకుస్థాపన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హిమాచల్‌లోని కులులోని మోహల్ నేచర్ పార్క్ వద్ద బిజిలీ మహాదేవ్ రోప్‌వేకు వాస్తవంగా శంకుస్థాపన చేశారు. ఈ రోప్‌వే ఏడాదిన్నరలో నిర్మించాల్సి ఉంది. ఈ రోప్‌వే నిర్మాణంతో ఒక్కరోజులో 36,000 మంది పర్యాటకులు బిజిలీ మహాదేవ్‌కు చేరుకుంటారని, ఇక్కడి పర్యాటకానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ రోప్‌వే ప్రాముఖ్యతను వివరిస్తూ భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో బిజిలీ మహాదేవ్ చేరుకోవడానికి పర్యాటకులు 2 నుంచి 3 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోంది. కానీ రోప్‌వే ద్వారా పర్యాటకులు కేవలం ఏడు నిమిషాల్లో బిజిలీ మహాదేవ్‌ను చేరుకోగలుగుతారు. బిజిలీ మహదేవ్‌కు చెందిన ఈ రోప్‌వే మోనో కేబుల్‌ రోప్‌వేగా ఉంటుందని, అందులో 55 బాక్సులను ఏర్పాటు చేస్తామని రోప్‌వే నిర్మాణ పనులను నిర్వహిస్తున్న నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ మేనేజర్ అనిల్ సేన్ తెలిపారు. దీని కెపాసిటీ గంటలో 1200 మందిని తీసుకువెళుతుంది. తరువాత ఈ సామర్థ్యాన్ని 1800కి పెంచుతామన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bijli mahadev
  • bijli mahadev ntc rpti
  • Foundation
  • Himachal Pradesh
  • Kangana Ranaut

తాజావార్తలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions