NTV Telugu Site icon

Kangana Ranaut: దేశ కీర్తి ప్రతిష్ఠలను భుజాలపై మోసింది.. దీపికపై కంగన ప్రశంసల వర్షం

Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఫిఫా వరల్డ్ కప్‌ ట్రోఫీని దీపిక ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్‌ అవార్డ్స్‌లోనూ దీపిక సందడి చేశారు. అకాడమీ అవార్డ్స్‌లో ‘నాటు నాటు’ సాంగ్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. అంతర్జాతీయ వేదికపై పాల్గొనే అవకాశం రావడంతో దీపికకు అనుకోని అతిథి నుంచి సర్‌ప్రైజ్ ఎదురయింది. దీపికను ప్రశంసిస్తూ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కంగనా ట్విట్టర్‌లో “దేశం మొత్తాన్ని ఏకతాటిపై ఉంచి అటువంటి ప్రతిష్టాత్మక పోడియం వద్ద నిలబడటం సులభం కాదు” అని రాసింది. ఆమె ట్వీట్ చేస్తూ.. “దీపికపదుకొనే ఎంత అందంగా కనిపిస్తారు, దేశం మొత్తాన్ని ఏకతాటిపై ఉంచి, దేశ కీర్తి ప్రతిష్ఠలను భుజాలపై మోస్తూ, చాలా దయగా, నమ్మకంగా మాట్లాడటం అంత సులభం కాదు. భారతీయ స్త్రీలు ఉత్తములు అని చెప్పడానికి దీపిక నిలువెత్తు నిదర్శనం” అని కంగనా రనౌత్ తెలిపారు.

Read Also: Prashanth Neel : సలార్ కోసం సూపర్ ప్లాన్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్‌ను గెలుపొందడంతో ఆమె చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని “నాటు నాటు” బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది. చంద్రబోస్ సాహిత్యం అందించగా ఎంఎం కీరవాణి స్వరపరిచారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు అందించిన ఈ పాట మార్చి 2022లో విడుదలైన వెంటనే చాలా ప్రజాదరణ పొందింది. మొదటి రౌండ్ ప్రకటనలలో దీపికా పదుకొణె వ్యాఖ్యాతలలో ఒకరిగా ఉన్నారు. ప్రతిష్టాత్మక అవార్డులలో ఇతర సమర్పకులలో హాలీ బెర్రీ, జాన్ ట్రావోల్టా, హారిసన్ ఫోర్డ్, ఇతరులు ఉన్నారు. ఈ షోను హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ చేశారు.