NTV Telugu Site icon

Kangana Ranaut: మోడీపై ప్రశంసలు కురిపించిన కంగనా రనౌత్

Kangana

Kangana

బీజేపీ ఎంపీ అభ్యర్థి, బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ మరోసారి మోడీ పాలనను ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనారనౌత్.. మండి సెగ్మెంట్‌లోని ఝకారీ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం జరగట్లేదని ఆమె వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు ఉక్రెయిన్ అధికారులతో సహా ప్రపంచ నాయకులు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోడీ మార్గనిర్దేశం చేస్తారన్నారు.

READ MORE: M. K. Stalin:తమిళనాడుపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ట్రాన్స్ జెండర్, దళిత విద్యార్థికి సీఎం సత్కారం

అలాగే అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు సైతం మోడీ వైపు చూస్తున్నారని కొనియాడారు. ప్రపంచ నాయకులు భారతదేశం నుంచి సహాయం కోరుతున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఈ ఖ్యాతి ఉందని ఆమె పేర్కొన్నారు. భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్‌ మోడీ చొరవ వల్లే పాక్ విడుదల చేసిందని కొనియాడారు. మోడీ కారణంగా థర్డ్ వరల్డ్ వార్ ఆగిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న భారత్ ను ఎన్నడూ చూడ లేదని, కాబట్టి ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.