Site icon NTV Telugu

Kangana Ranaut : మహేష్ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ భాధగానే ఉంది..

Whatsapp Image 2023 09 24 At 6.49.17 Pm

Whatsapp Image 2023 09 24 At 6.49.17 Pm

టాలీవుడ్‌ స్టార్ హీరో మహేశ్‌ బాబు తో ఆ సినిమాలో తాను నటించనందుకు ఇప్పటికీ బాధగానే ఉంటుందని నటి కంగనా రనౌత్ రీసెంట్ గా చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో తెలిపారు. టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన ‘పోకిరి’ సినిమాలో ముందుగా కంగనాను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఈ భామ ఈ సినిమాను వదులుకుంది. ఇంత కాలానికి పోకిరి సినిమాలో తాను నటించకపోవడానికి కారణమేంటో తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ”నాలోని యాక్టర్‌ని గుర్తించింది దర్శకుడు పూరీ జగన్నాథ్‌.నేను నటిని కాకముందే నేను పెద్ద స్టార్‌ని అవుతానని ఆయన అన్నారు. ‘పోకిరి’ సినిమాతో ఆయన నన్ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు. అదే సమయంలో నాకు బాలీవుడ్‌ లో ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమా అవకాశం వచ్చింది. రెండు సినిమాల చిత్రీకరణ ఒకే సమయం లో ఉండడంతో నేను హిందీ చిత్రాన్నే ఎంపిక చేసుకున్నాను .

ఆ తర్వాత ‘ఏక్‌ నిరంజన్‌’తో పూరీ జగన్నాథ్‌ నన్ను టాలీవుడ్‌కి పరిచయం చేశారు. ఆ సినిమా తో నేను, ప్రభాస్‌ మంచి స్నేహితులమయ్యాం” అని తెలిపారు.అలాగే తాను ఎవరెవరి తో కలిసి పనిచేయాలనుకుంటున్నారో కూడా కంగనా తెలిపారు. టాలీవుడ్‌ ప్రముఖ హీరో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా నటించాలని ఉంది అని ఆమె తెలిపింది. అలాగే అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో కూడా నటించాలనుందని తన మనసులో మాట బయటపెట్టారు కంగనా. ప్రస్తుతం దీనికి సంబంధిత క్లిప్పింగ్స్‌ ని రామ్‌ చరణ్‌ అభిమానులు మరియు కంగనా ఫ్యాన్స్‌ నెట్టింట షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో త్వరగా సినిమా రావాలని వారు కోరుకుంటున్నారు.ప్రస్తుతం ‘చంద్రముఖి’ కి సీక్వెల్‌ గా రూపొందిన ‘చంద్రముఖి 2’ లో కంగన కీలక పాత్ర పోషించారు. రాఘవ లారెన్స్‌ హీరోగా దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 28న గ్రాండ్ గా విడుదల కానుంది.

Exit mobile version