NTV Telugu Site icon

Kangana Ranaut: కంగనా రనౌత్ పెళ్లి చేసుకునేది ఇతన్నేనా?

Kanganaaaa

Kanganaaaa

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో వైరల్ అవుతోంది.. కంగనా ఓ వ్యక్తి చెయ్యి పట్టుకొని వెళ్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది..

ఈ ముద్దుగుమ్మ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది..అయితే తాజాగా కంగనా రనౌత్ ఓ మిస్టరీ మ్యాన్‌తో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. . కంగనా ఓ యువకుడు చేతులు పట్టుకుని సెలూన్ నుంచి బయటకు వెళ్తున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. అతను ఎవరు?, ఎందుకు ఇద్దరు కలిసి వెళ్లారు? ఇలాంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి..

కంగనా అతడిని పెళ్లి చేసుకోబోతుందా.? అని పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.. ఏదైతేనేం అతను చాలా అందంగా ఉన్నాడు.. ఈడు జోడు బాగా ఉంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘ఎమర్జెన్సీ’తో బిజీగా ఉంది. ఆమె ఈ లో నటించడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని నవంబర్ 2023లో విడుదల చేయాలని అనుకున్నారు.. కొన్ని కారణాల వల్ల ఈ ఏడాదిలో విడుదల కానుంది..