Kangana: అవకాశాలు తగ్గినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘క్వీన్’గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్. గతేడాది ‘ఎమర్జెన్సీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ప్రస్తుతం ముంబై 26/11 దాడుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘భారత్ భాగ్య విధాత’ చిత్రంతో బిజీగా ఉన్నారు. వివాదాలకు అతీతంగా, తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పే కంగనా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఆసక్తికర పరిణామాలను పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రోత్సాహం నుంచి భన్సాలీ ఆఫర్‌ను తిరస్కరించడం వరకు ఆమె పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : Raja Shivaji: ‘రాజా శివాజీ’ ట్రైలర్‌ను విడుదల.. వేదికపై చిన్నపిల్లలా ఏడ్చేసిన జెనీలియా.. రితేష్
Also Read
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- 144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
- Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
- Anupama Singh: "మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది".. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
కంగనా మాట్లాడుతూ.. ‘నా కెరీర్ మొదలవ్వక ముందు, కేవలం 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్‌ను కలిశారు. అప్పట్లో నన్ను చూడగానే సల్మాన్ ‘ఈమె సంజయ్ లీలా భన్సాలీ హీరోయిన్’ అని కొనియాడి, నన్ను వెళ్లి భన్సాలీని కలువమని సూచించారు. సల్మాన్ మాట మీద భన్సాలీని కలిసినప్పటికీ, అప్పట్లో నాకు ఆయన అవకాశం ఇవ్వలేదు. కానీ, కాలక్రమేణా నా స్టార్డమ్ చూశాక భన్సాలీ స్వయంగా ‘రామ్ లీలా’లో ఒక స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించారు. అయితే, నాకు ఐటెం నంబర్లు చేయడం ఇష్టం లేదని ఆ భారీ ఆఫర్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించా. “ఆ క్షణం అలా గడిచిపోయింది, కానీ భన్సాలీ గారు ఇప్పటికీ సల్మాన్ మాట విని ఉండాల్సిందని అంటుంటారు” అని కంగనా గర్వంగా చెప్పుకొచ్చారు. అలాగే హాలీవుడ్ గురించి మాట్లాడుతూ..
‘చాలా మంది భారతీయ నటీనటులు హాలీవుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ నాకు మాట్రం హాలీవుడ్ వెళ్లే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలో అమెరికాను గొప్పగా చూపించాలనే ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంటుంది. మన దేశపు తారలు అక్కడికి వెళ్లి వారి ఎజెండా కోసం ఎందుకు పనిచేయాలి?. మనకు మన సొంత ఎజెండా ఉండాలి, మన సంస్కృతిని ప్రతిబింబించే కథలను ప్రపంచానికి చాటి చెప్పాలి’ అని ఆమె ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే…! IVF ముసుగులో ఇంత దారుణమా
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
ట్రెండింగ్
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్‌లోకి రా.!” హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!