Site icon NTV Telugu

Kangana Ranaut : ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా..

Whatsapp Image 2023 09 24 At 8.55.35 Am

Whatsapp Image 2023 09 24 At 8.55.35 Am

బాలీవుడ్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌. మనసులో ఉన్నది ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడుతుంది. అక్కడున్నది ఎవరినైనా సరే ధీటుగా జవాబిస్తుంది. ఇలా ఈ భామ అనేక వివాదాలకు కేరాఫ్‌ గా నిలిచింది. కమర్షియల్‌ చిత్రాలతో పాటు ఈ భామ లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే కెరీర్‌ ప్రారంభంలో సౌత్‌ సినిమాలలో కూడా నటించింది కంగనా. తెలుగులో ఆమెచే సిన మొదటి సినిమా `ఏక్‌ నిరంజన్‌`.ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు., పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. ఇందులో హీరోయిన్‌గా కంగనా రనౌత్‌ నటించింది. ఈ సినిమాతోనే కంగనా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో మరో సినిమా చేయలేదు. తను చేసిన తొలి చిత్రమే నిరాశ పరచడంతో ఈ భామ మళ్ళీ టాలీవుడ్‌ వైపు చూడలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో మాత్రం మంచి మెమొరీస్‌ ఉన్నాయని చెప్పింది కంగనా.

తాజాగా ఆ విషయాలపై ఓపెన్‌ అయ్యింది కంగనా రనౌత్‌.`ఏక్‌ నిరంజన్‌` సినిమా షూటింగ్‌ సెట్‌లో ప్రభాస్‌తో చాలా సరదాగా గడిపినట్టు ఆమె తెలిపింది. అప్పుడు ప్రభాస్‌, నేను చాలా యంగ్‌ ఏజ్‌లో ఉన్నామని అల్లరి చేస్తూ  ఉండేవాల్లమని ఆమె చెప్పింది. సెట్‌లో చాలా ఛిల్‌ అయ్యామని, అంతేకాదు ఒకరినొకరు సెట్‌లో టీజింగ్‌ కూడా చేసుకున్నట్టు తెలిపింది కంగనా రనౌత్‌. అప్పుడు చాలా యంగ్‌గా ఉన్నామని, ఇప్పుడు చాలా మారిపోయినట్టు ఆమె తెలిపింది. ప్రభాస్‌ పూర్తిగా కొత్తగా అయిపోయారు.పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారని వెల్లడించారు.ఈ సందర్భంగా `ఏక్‌ నిరంజన్‌ 2` సినిమా చేస్తే.. అందులో మీరు నటించడానికి సిద్ధమేనా అనే ప్రశ్నకి కంగనా స్పందించింది. నేను సిద్ధంగానే ఉంటానని ఆమె వెల్లడించింది. సౌత్‌లో నటించేందుకు నేను ఎంతో ఆసక్తికరంగా ఉన్నానని, ఇక్కడి సినిమాలు చేయాలని ఉందని ఆమె వెల్లడించింది. మంచి స్క్రిప్ట్ లు కనుక వస్తే ఇక్కడ నటించాలని ఉందని తన మనసులో మాటను చెప్పింది.తాను ప్రస్తుతం `చంద్రముఖి 2`లో నటిస్తున్న నేపథ్యంలో ఈ పాత్రని నేనే అడిగి మరి నటించాను.. `చంద్రముఖి2` దర్శకుడు వాసు వేరే వారియర్‌ ఫిల్మ్ స్టోరీతో తన వద్దకు వచ్చారని, కానీ అప్పటికే ఆయన `చంద్రముఖి 2`సినిమాని స్టార్ట్ చేశారని, అందులో చంద్రముఖి పాత్రకి ఇంకా ఎవరూ ఫైనల్‌ కాలేదు. దీంతో నేను చేస్తానని అడిగి ఇందులో నటించినట్టు వెల్లడించింది కంగనా రనౌత్‌

Exit mobile version