NTV Telugu Site icon

Kangana Ranaut : పుష్ప 2లాంటి సినిమాలు తీయడం మనకు చేత కాదా అంటున్న స్టార్ హీరోయిన్

Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut : ఈ మధ్య కాలంలో వార్తలో నిలిచిన సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి సంచలనాలను నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినిమాల రికార్డుల‌నే తిర‌గ‌రాసింది. ఖాన్ లు.. క‌పూర్ ల రికార్డుల‌ను వెన‌క్కి నెట్టేసి ఇండియాలోనే నంబర్ 1 చిత్రంగా నిలిచింది. ‘దంగ‌ల్’ 2000 కోట్ల రికార్డుల‌ను సైతం తిర‌గ‌రాస్తుంద‌న్న అంచనాలు ఉన్నాయి. మ‌రో మూడు వారాలు ఇదే దూకుడు చూపిస్తే దంగ‌ల్ చ‌రిత్ర చెదిరిపోవడం ఖాయమని అంచనా వేస్తోంది.

Read Also:Rashmika : ఆ హీరోతో రష్మిక ప్రేమాయణం.. కన్ఫమ్ చేసిన నాగవంశీ

ఇంత గొప్ప విజ‌యం సాధించినా? ఈ విజ‌యాన్ని బాలీవుడ్ స్పోర్టివ్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. సినిమాకు అనుకున్న స్థాయిలో అక్కడ నుంచి అప్లాజ్ రావ‌డం లేదు. స్టార్ హీరోలు, అగ్ర నిర్మాణ సంస్థలు పుష్ప 2 వసూళ్ల గురించి పట్టన్నట్లే ప్రవర్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో మండే మంట‌లో పెట్రోల్ పోసిన‌ట్లు అయింది.

Read Also:Places of Worship Act: ప్రార్థనా స్థలాలపై అసదుద్దీన్‌ ఒవైసీ పిటిషన్.. నేడే విచారణ..

మా బాలీవుడ్ వాళ్లు ‘పుష్ప-2’ లాంటి సినిమాలు తీయ‌లేరు. వీళ్లకు కేవ‌లం అమ్మాయిలు-హీరోయిన్లు ఇంకా బీచ్ లు ఉంటే చాలు. ఇంకే అవ‌స‌రం లేదని వ్యాఖ్యానించిన‌ట్లు మీడియాలో ప్రచారం జ‌రుగుతోంది. అలాగే బాగా ఫేమ‌స్ అవుతున్న వారిప‌ట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఇప్పుడీ వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. టాలీవుడ్ ముందు బాలీవుడ్ ఏమాత్రం గొప్ప కాదన్నట్లు ఫోకస్ అవుతుంది. బాలీవుడ్ పై కంగ‌న ఇలాంటి వ్యాఖ్యలు చేయ‌డం కొత్తేం కాదు. గ‌తంలోనూ పరిశ్రమ తీరును ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే వ‌రుస పాన్ ఇండియా విజ‌యాల‌తో టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ ఇండస్ట్రీగా దూసుకుపోతుంది. ‘బాహుబ‌లి’, ‘ఆర్ ఆర్ ఆర్’, ‘స‌లార్’, ‘పుష్ప‌’, ‘కార్తికేయ‌-2’, ‘హ‌నుమాన్’, ‘సాహో’, ‘స‌లార్’ లాంటి చిత్రాలు పాన్ ఇండియాలో ఎలాంటి విజ‌యాలు అందుకున్నాయో తెలిసిందే.

Show comments