NTV Telugu Site icon

Daali Dhananjay: గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్న ‘జాలిరెడ్డి’.. పెళ్లి ఎప్పుడంటే

Daali Dhananjay

Daali Dhananjay

Daali Dhananjay Wedding Video: డాలి ధనంజయ.. ఈ పేరు చెబితే చాలామంది అతనిని గుర్తుపట్టకపోవచ్చు. అయితే పుష్ప సినిమాలో ‘జాలిరెడ్డి’ అని చెబితే ఇట్టే అందరికీ గుర్తుకు వచ్చేస్తాడు. అయితే, దీపావళి పండుగ రోజును పునస్కరించుకొని ధనంజయ ఓ శుభవార్త తెలిపాడు. తాను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇందుకు సంబంధించి వీడియోను షేర్ చేస్తూ తన కాబోయే భాగస్వామిని కూడా పరిచయం చేశాడు ఈ హీరో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వినియోగదారులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: Jani Master: వాళ్ళ కేరింతలే మన సంతోషం అంటూ.. దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ

ఇకపోతే ధనుంజయ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు ధన్యత. ఈవిడ సినిమా రంగానికి సంబంధించిన అమ్మాయి కాదు. వీరిద్దరూ మైసూర్లో చదువుకున్నప్పుడు నుంచి ఒకరకి ఒకరు చాలా సంవత్సరాలుగా తెలుసు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి, చివరికి వారి ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు ఈ లవ్ బర్డ్స్. ఫిబ్రవరి 16, 2025న మైసూర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వీరి వివాహం అంగరంగా వైభవంగా జరగనుంది. ఉదయం పెళ్లి, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

వీరిద్దరూ మొదటిసారి కలిసింది మైసూర్ లోనే కాబట్టి.. వారిద్దరూ అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునట్లు సమాచారం. ఇకపోతే ధనుంజయ్ షేర్ చేసిన వీడియోలో ఆయన తన కాబోయే భార్య కోసం ఓ కవిత్వం కూడా రాసాడండోయ్. కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకున్న ధనంజయ.. పుష్ప సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కు పరిచయమయ్యాడు. సినిమాలో ‘జాలి రెడ్డి’ అనే నెగిటివ్ రోల్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. వచ్చే నెలలో విడుదలయ్యే పుష్ప 2 లో కూడా ఈయన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు పలు సినిమాలను చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు ధనంజయ.

Show comments