Site icon NTV Telugu

Kamareddy Master Plan : రేపు కామారెడ్డి మున్సిపల్ అత్యవసర సమావేశం..

Kamareddy

Kamareddy

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు కామారెడ్డి మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ముసాయిదా రద్దు మరియు డిటిసిపి అధికారులు, ఢిల్లీ కన్సల్టెన్సీ పై ప్రభుత్వానికి ఫిర్యాదు అంశాలు ఎజెండా పేర్కొంటూ ప్రకటన జారీ చేశారు. కౌన్సిలర్ల వరుస రాజీనామాలు, రేపు ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడి పిలుపుతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జాహ్నవి మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గత నెలన్నర రోజులుగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ నమూనాను రద్దు చేయాలని రేపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేస్తున్నట్టు వెల్లడించారు.

Also Read : Minister KTR : 150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌

ఢిల్లీ కన్సల్టెన్సీ తయారు చేసి పంపిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని రేపు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించనున్నట్లు తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ తీర్మానం చేసి పంపిన మాస్టర్ ప్లాన్ వేరు ఢిల్లీ నుండి వచ్చిన మాస్టర్ ప్లాన్ వేరని, రైతులకు వ్యతిరేకంగా మేము ఎలాంటి చర్యలు తీసుకొమన్నారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అభ్యంతరాలను 60 రోజుల సమయం ఇవ్వడం జరిగిందని, ఈ 60 రోజుల్లో 2,396 అభ్యంతరాలు వచ్చాయన్నారు. బీఅర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాననే ఉంటుందని, రైతులకు అన్యాయం జరిగే పని చేయదన్నారు. ప్రతిపక్ష పార్టీలు రైతులను పక్కదారి పట్టిస్తున్నాయని, ఏ రైతుకు సంబంధించిన ఒక్క ఎకరం భూమి కూడా తీసుకోమని ఇదివరకే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారన్నారు.

Also Read : Nose Picking : పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా.. అయితే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే

Exit mobile version