Site icon NTV Telugu

Sexual Harassment: తనిఖీల పేరుతో వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్‌ అరెస్ట్‌..

Sexual Harassment

Sexual Harassment

Sexual Harassment: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌సింగ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనునాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పీహెచ్‌సీలకు చెందిన మరికొందరు మహిళా వైద్యాధికారులు కూడా లక్ష్మణ్‌సింగ్‌, శ్రీనునాయక్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354డి, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల పేరుతో డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌సింగ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనునాయక్‌ లైగింక వేధింపులకు పాల్పడుతున్నారని జిల్లాలోని వివిధ పీహెచ్‌సీలకు చెందిన 21 మంది మహిళా వైద్యాధికారులు 10 రోజుల్లోనే వైద్యారోగ్యశాఖకు ఫిర్యాదు చేశారు. పీహెచ్‌సీకి వస్తే డీఎంహెచ్‌ఓ పక్కనే కూర్చునేవారు. జీవితం ఎలా సాగిపోతుందో ఫోన్ చేసి అవమానకరంగా మాట్లాడేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read also: Turtles Seized: అక్రమంగా తరలిస్తున్న 1600 తాబేళ్ల పట్టివేత!

విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడగా.. వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు డీఎంహెచ్‌ఓ, సూపరింటెండెంట్‌ల తీరుపై బాధిత మహిళా ఉద్యోగులు. మరికొందరు అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గత కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఏడీహెచ్‌ అమర్‌సింగ్‌, డీఎంహెచ్‌ఓపైనా, ఇతర ఉద్యోగులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. మహిళ మెడికల్ ఆఫీసర్లు ఏడాదిన్నరగా లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దేవునిపల్లి పోలీసులు DMHO లక్ష్మణ్ సింగ్ తో పాటు కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస్ నాయక్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Loose Motions: మోషన్స్ కు చెక్ పెట్టే నేచురల్ రెమెడీస్..

Exit mobile version