Site icon NTV Telugu

Kamal Haasan: ‘ప్రాజెక్ట్ కె’ కు అరుదైన గౌరవం.. కమల్ ఏమన్నాడంటే.. ?

Kamal

Kamal

Kamal Haasan:ప్రాజెక్ట్ కె.. ప్రాజెక్ట్ కె.. ప్రాజెక్ట్ కె.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ సినిమా. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తుండగా విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్స్ తోనే సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసిన మేకర్స్.. సినిమా రిలీజ్ కు ముందే అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. జూలై 20 న ఈ వేడుక అమెరికాలో జరగనుంది.

Rana Daggubati: రానా నాయుడు తో సీత.. పార్ట్ 2 లో అయితే లేదుగా

ఇప్పటివరకు ఈ ఈవెంట్ కు తెలుగువారు వెళ్లడమే అరుదు అలాంటింది.. ఒక తెలుగు సినిమా ఈ ఈవెంట్ లో టైటిల్ ను రివీల్ చేయడం అంటే అరుదైన గౌరవమని చెప్పాలి. దీంతో చిత్ర బృందం మొత్తం సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన కమల్.. తాజాగా చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ” శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో తొలిసారి అడుగుపెడుతున్న తెలుగు సినిమా ప్రాజెక్ట్ కె అయ్యినందుకు చిత్రానికి కంగ్రాట్స్.. అక్కడ కలుసుకుందాం” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ప్రభాస్, కమల్ ఏ రేంజ్ లో రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.

Exit mobile version