Site icon NTV Telugu

Kalyan Ram: ఆసక్తి రేపుతున్న కల్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్

Emogos

Emogos

Kalyan Ram: బింబిసార వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో నందమూరి కల్యాణ్ రామ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంతో కల్యాణ్ రామ్ రేంజ్ పెరిగింది. దీంతో ఆయన అభిమానులు తదుపరి చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ అయ్యారు. వాటిలో NKR19 ఒకటి. నిజానికి వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న సమయంలో బింబిసార విజయం మంచి కిక్ నిచ్చింది కల్యాణ్ రామ్ కి. వైవిధ్యమైన కథతో వచ్చిన బింబిసారతో మంచి హిట్ అందుకున్నారు. దీంతో ఆయన నటించే తదుపరి సినిమా కూడా మరింత వైవిధ్యంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు ఈ నందమూరి హీరో. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చిత్రాలపై పెరుగుతున్న అంచనాలను రీచ్ అయ్యేలా తదుపరి చిత్రానికి వైవిధ్యంగా ఉండే ‘అమిగోస్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Read Also: Governor Tamilisai: ఢిల్లీకి తమిళి సై.. అమిత్ షాతో భేటీ

చిత్రం టైటిల్ తో పాటు అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 10, 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కల్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ‘బింబిసార’లో ద్విపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్.. ‘అమిగోస్’లో ఏకంగా మూడు పాత్రల్లో నటించనున్నారు. చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఇక `ఎన్‌కేఆర్‌ 20` సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మాణంలో చేస్తున్నారు. దీనికి `118` హిట్‌ చిత్రాన్ని అందించిన కేవి గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Read Also: Plane Crash : టాంజానియాలో కూలిన విమానం.. 19మంది మృతి

Exit mobile version