Kavitha New Party Launch: తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో సమావేశం నిర్వహంచారు. ఈ మీటింగ్‌లో కవిత తన కొత్త పార్టీ పేరు “తెలంగాణ రాష్ట్ర సేన(TRS)”గా ప్రకటించారు. పార్టీ పేరు షాక్‌కు గురి చేసింది. శనివారం ఉదయం కవిత సర్వ మత ప్రార్థనలు చేశారు. బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. గన్‌పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుని ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటించారు. అనంతరం.. పార్టీ జెండావిష్కరించారు. ఈ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌ను బిగ్ షాక్‌కు గురి చేసింది. ఇదిలా ఉండగా.. పార్టీ ప్రకటించే సభా ప్రాంగణాన్ని తెలంగాణ కలలు ఉట్టిపడేలా డిజైన్ చేయడం ఆకట్టుకుంది. వరంగల్ కాకతీయ కళా తోరణం ఆకృతిలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు ఫులే, ఆచార్య జయశంకర్ విగ్రహాలను సైతం ఏర్పాటు చేశారు.
Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్..

Kavitha