NTV Telugu Site icon

Kalki 2898 AD : భారీ పాన్ ఇండియా మూవీ విడుదల వాయిదా పడనుందా..?

Whatsapp Image 2023 07 31 At 4.55.27 Pm

Whatsapp Image 2023 07 31 At 4.55.27 Pm

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్​లో రూపొందుతున్న ఈ మూవీ కి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా దిశా పటానీ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.ఇప్పటికే కామిక్​ కాన్​ వేదిక గా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ లో ప్రభాస్​ లుక్స్​ తో పాటు పలు అంశాలను షూట్ చేసిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ చూసి సినీ ప్రముఖులు ప్రశంసలు అందించారు. ఈ అద్భుతమైన గ్లింప్స్ చూసి సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమాపై భారీ గా అంచనాలు ఉండటంతో మూవీ మేకర్స్​ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఈ మూవీని అనుకున్న సమయం కంటే ఇంకా ఆలస్యంగానే విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఏ మాత్రం నిరాశ చెందకుండా చాలా గ్రాండ్ గా గ్రాఫిక్స్ సెట్ చెయ్యాలని  నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు సమాచారం.ఎందుకంటే గ్లింప్స్ కి వచ్చిన రెస్పాన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా  నాగ్ అశ్విన్ ప్రతీది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారట. అందువల్ల మూవీ విడుదల లేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల ​ చేయనున్నట్లు మూవీ యూనిట్​ ప్రకటించింది. అయితే ఈ క్రమంలో అనుకున్న తేదీ కంటే మరో నాలుగు నెలల పాటు వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తుంది.వైజయంతి మూవీస్ కు బాగా కలిసి వచ్చిన తేదీ మే 9 విడుదల చేయబోతున్నట్లు సమాచారం.