NTV Telugu Site icon

Kalki 2898 AD: ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’లో టాలీవుడ్ యువ హీరో!

Kalki 2898 Ad

Kalki 2898 Ad

Tollywood Hero Teja Sajja part of Prabhas’s Kalki 2898 AD Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి. అశ్వని దత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా కల్కి 2898 ఏడీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కల్కి 2898 ఏడీలో టాలీవుడ్ యువ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. ఇటీవల విడుదలైన ‘హనుమాన్’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన తేజ సజ్జా. ప్రభాస్‌ నటిస్తున్న కల్కి 2898 ఏడీలో తేజ నటిస్తున్నాడట. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాత సి. అశ్వని దత్‌తో తేజ కలిసి కనిపించడం ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. తాను చేయాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, విషయం చెప్పడానికి సరైన క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు.

Also Read: Ram Charan: రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!

కల్కి 2898 ఏడీలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై.. భవిష్యత్తుతో ముగుస్తుంది. తాజాగా ‘జస్ట్‌ ది వార్మ్‌ అప్‌’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.