Site icon NTV Telugu

Kalki 2898AD : అక్కడ ఐమాక్స్ లలో కల్కి షోలు రద్దు..?

Kalki

Kalki

Kalki 2898AD : జూన్ 27 గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన మైతో సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 AD సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించడానికి రెడీ అయిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అమితాబచ్చన్, కమలహాసన్ మొదలగు వారు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Minister Ramprasad Reddy: కుప్పంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. అన్ని ప్రాంతాలకు సర్వీసులు

ఈ నేపథ్యంలోనే తాజాగా నార్త్ అమెరికాలో సినిమాకు సంబంధించి రిలీజ్ వరకే ఏకంగా లక్ష టికెట్లు అమ్ముడుపోయాయంటే.. అక్కడ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం కెనడాలో ఐమాక్స్ స్క్రీనింగ్ లతో సమస్యలు వచ్చినట్లు కనపడుతుంది. హిందీ వర్షన్ కోసం 15 కంటే ఎక్కువ ఐమాక్స్ షోలు ఊహించిన విధంగా రద్దు అయ్యాయి. ఇందుకు సంబంధించి టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మెసేజ్ల రూపంలో సమాచారాన్ని అందజేశారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా తరఫున చాలామంది అభిమానులు షేర్ చేశారు.

IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే

వైజయంతీ మూవీస్ నిర్మించిన, కల్కి 2898 ADలో దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ బహుభాషా చిత్రం 3D, 4DX సహా బహుళ ఫార్మాట్లలో విడుదల చేయబడుతుంది. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Exit mobile version