NTV Telugu Site icon

Kalki 2898 AD : యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ సెట్ చేస్తున్న ప్రభాస్..

Kalki

Kalki

Kalki 2898 AD : కల్కి 2898 AD లో దీపికా పదుకొణె, దిశా పటాని., అమితా బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన పాన్ – ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో కల్కి కూడా చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కేవలం మరో 5 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. కొన్ని రోజులుగా అమెరికా మార్కెట్‌ లో కల్కి సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Jammu Kashmir: చొరబాటుకు యత్నిస్తున్న ఉగ్రవాదులపై భద్రతాబలగాల కాల్పులు.. ఇద్దరు హతం..!

ఇక భారత్ లోనే కాలేదు.. కల్కికి అపూర్వ స్పందన ప్రపంచ వ్యాప్తంగా వస్తోందనే చెప్పాలి. గత సారి సాలార్ సినిమాతో సందడి చేసిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి అదరగొడుతున్నాడు. కల్కి ఇప్పుడు ఉత్తర అమెరికా అంతటా 2.5 మిలియన్ల డాల్లర్స్ మార్కును అధిగమించి మరొక వేగవంతమైన రికార్డును నెలకొల్పాడు. ఇక ఇదే తరహా కొనసాగిస్తే.. రిలీజ్ నాటికి ఈ సినిమా ప్రీ సేల్స్ లోనే కచ్చితంగా 3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చూడాలి మరి సినిమా విడుదల తర్వాత ప్రభాస్ ఎంతవరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సునామీని సృష్టిస్తాడో..

Indian Labour: పొలంలో పనిచేస్తుండగా తెగిన చేయి.. ఇటలీలో భారతీయ కూలీ మృతి

Show comments