NTV Telugu Site icon

Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..

Kalki

Kalki

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ భాషతో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలై నేటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించింది.

మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ గడ్డపై నెమ్మదిగా మొదలై ఆ తర్వాత పాజిటివ్ మౌత్‌టాక్‌తో ఒక్కసారిగా పుంజుకుంది. కాగా బాలీవుడ్‌లో 11 రోజులకు గాను రూ. 200 కోట్ల గ్రాస్ సాధించి, ప్రభాస్ పేరిట మరోక రికార్డు నమోదు చేసింది. హిందీ సీమలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల దిశగా పయనిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోను డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.నైజాంలో నిన్నటితో ఈ చిత్రం రూ. 150కోట్ల గ్రాస్ ఫిగర్ ను అందుకుంది. నైజాంలో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్లు కలెక్షన్స్ రాబట్టిన 3 సినిమాలు కలిగిన హీరోగా ప్రభాస్ పేరు నిలిచిపోతుంది. ఇప్పట్లో ఆ రికార్డును బద్దలు కొట్టగలిగే హీరో లేడనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉండగా నార్త్అమెరికాలో కల్కి ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. గడచిన వీకెండ్ తో ఈ చిత్రం $16M రాబట్టినట్లు అధికారకంగా వెల్లడించారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ జవాన్ కలెక్షన్స్ ను దాటి, ఓవర్ సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ -5 చిత్రాల జాబితాలో కల్కి వచ్చి చేరింది. ఇంగ్లిష్ గడ్డపై కల్కి జోరు హీరో ఎవరు లేరు. విడుదల నాటి నుండి నేటి వరకు బుకింగ్స్ లో అదే జోరు కనిపిస్తోంది. కల్కి లాంగ్ రన్లో $20M క్లబ్ లో ఎంటర్ అవుతుందేమో చూడాలి…

Show comments