NTV Telugu Site icon

Kaleshwaram Commission : ఈఎన్‌సీ నల్ల వెంకటేష్‌పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ ఆగ్రహం

Kaleshwaram Kamission

Kaleshwaram Kamission

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అంశం గత ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించింది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ENC నల్ల వెంకటేష్ పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది కమిషన్. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తప్పుడు ఆధారాలు ఇస్తే సహించేది లేదు అంటూ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ వార్నింగ్‌ ఇచ్‌చారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద సికెంట్ పైల్స్ CE CDO సజెస్ట్ చేసింది అన్న వ్యాఖ్యలకు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Bhagat Singh Jayanti: ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు.. షాహిద్ భగత్‌సింగ్

సీఈ సీడీవో డిజైన్స్ అండ్ డ్రాయింగ్ మాత్రమే ఇస్తుందని, మిగతా విషయాల్లో సీఈ సీడీవో ఎలా కలగజేసుకుంటుందని కమిషన్ ప్రశ్నించింది. సికెంట్ ఫైల్స్ సజెషన్ చేసినట్లు డాక్యుమెంట్ ఆధారాలు కమిషన్‌కు ఇస్తారా అని నల్ల వెంకటేశ్వర్లును కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు కమిషన్ ముందు సమాధానాలు చెప్తే మేము నమ్మాలా అన్న కమిషన్ చీఫ్‌ మండిపడినట్లు తెలుస్తోంది. నీకు కన్ఫ్యూజన్ ఉంటే నీ దగ్గరే పెట్టుకో నా వరకు తీసుకురాకు అంటూ అసహనం వ్యక్తం చేశారు. విచారణను మధ్యలోనే ఆపివేసి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణ రావాలి అవ్వలేదు అంటూ కమిషన్ విచారణ ఆపేసింది.

Bhagat Singh Jayanti: ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు.. షాహిద్ భగత్‌సింగ్