Site icon NTV Telugu

Kaleshwaram Lucky Draw: రూ.5001తో కూపన్ కొనండి.. లక్కీ డ్రాలో కోటిన్నర ప్రాపర్టీ పట్టండి!

Kaleshwaram Lucky Draw

Kaleshwaram Lucky Draw

‘లక్కీ డ్రా’ అంటే.. మధ్యతరగతి జనాలకు ఎక్కడ లేని ఆశ పుట్టుకొస్తుంది. లక్కీ డ్రాలో ఫ్రీగా బైక్, కార్, ఏసీ, బంగారం, నగదు, ప్రాపర్టీలు గెలుపొందచ్చన్న ఆశతో చాలామంది స్కీమ్‌లు వేస్తుంటారు. లక్కీ డ్రాలలో కొన్ని నిజమైనవే ఉండగా.. మరికొన్ని మోసాలు కూడా ఉంటాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ జనాలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అందుకే కొత్త కొత్త లక్కీ డ్రాలు వేస్తుంటారు. తాజాగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రస్తుతం ఓ లక్కీ డ్రా నడుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

Also Read: Kritunga Restaurant: కృతుంగ రెస్టారెంట్‌‎లో షాకింగ్ ఘటన.. రాగి సంకటిలో బొద్దింక ప్రత్యక్షం!

కాళేశ్వరంలోని లక్కీ డ్రాలో కోటిన్నర ప్రాపర్టీని సొంతం చేసుకునే అవకాశం ప్రజల ముందుంది. ఈ లక్కీ డ్రాకు యజమానిగా సంతోషం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. రూ.5001తో లక్కీ డ్రా కూపన్ కొనుగొలు చేస్తే.. 1.5 కోట్ల విలువగల ఎస్ఎస్ఆర్ లాడ్జ్, కన్వెన్షన్ హాల్ మీ స్వంతం అంటూ ప్రకటించారు. కూపన్ కొనుగొలు చేసేందుకు జనాలు ఉవిళ్లూరుతున్నారు. మొత్తం 2500 కూపన్లు ఉన్నాయి. మొదటి బహుమతి కోటిన్నర ప్రాపర్టీ, రెండవ బహుమతి రెండు తులాల బంగారం, మూడో బహుమతి కిలో వెండి అందజేస్తామని కూపన్‌లో యజమాని సంతోషం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జనవరి 14న మహరాష్ట్ర సిరోంచ ఫంక్షన్ హాల్‌లో లక్కీ డ్రా నిర్వహణ ఉంటుంది. ఈ లక్కీ డ్రా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Exit mobile version