ఈరోజు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వెంకటేశ్వర్లను రెండు విడతలుగా విచారించింది కమిషన్. రేపు మళ్లీ విచారణకు రావాలని వెంకటేశ్వర్లను కమిషన్ ఆదేశించింది. బహిరంగ విచారణలో వెంకటేశ్వర్లు మాజీ ముఖ్యమంత్రి పేరును పలుసార్లు ప్రస్తావించారు. టెక్నికల్ అంశాల తర్వాత డీపీఆర్ ఎవరు అప్రూవల్ చేశారని వెంకటేశ్వర్లను ప్రశ్నించింది కమిషన్. డీపీఆర్ అప్రూవల్ మాజీ ముఖ్యమంత్రి చేశారని కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ చెప్పారు.
Asaduddin Owaisi: చైనా- భారత్ మధ్య ఒప్పందంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
డీపీఆర్‌లు వేరువేరుగా చేశారా? ఓకే డీపీఆర్ ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. మూడు బ్యారేజీలకు వేరువేరుగా ఒకసారి.. మొత్తం కలిపి మరొకసారి రెండు డీపీఆర్లు ఉన్నాయని వెంకటేశ్వర్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కింద కోల్బెడ్ టెస్టులు నిర్వహించారని, కోల్బెడ్ ఆనవాళ్లు గుర్తించినట్లు రిపోర్టులు ఉన్నాయని కాళేశ్వరం కమిషన్ పేర్కొంది. బ్యారేజీలలో నీళ్లను నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించింది కమిషన్.
Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం.. టీఎంసీ యువనేతతో లింక్స్..
ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నీళ్లను నిల్వ చేసినట్లు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కమిషన్ ముందు చెప్పారు. ప్రతిరోజు రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు రూ. 40 వేల కోట్ల వరకు ఉండే ఖర్చు 3 టీఎంసీలు అయ్యేసరికి డబుల్ ఎలా అయిందని కమిషన్ ప్రశ్నించింది. కేవలం అదనంగా 2 లక్షల ఎకరాల కోసం అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలా అని ప్రశ్నించింది. ప్రాణహిత చేవెళ్ల వద్ద రెండు లిఫ్టులు తక్కువ విద్యుత్ ఖర్చు కాదని.. కాళేశ్వరం మూడు లిఫ్టులు ఎక్కువ విద్యుత్ ఖర్చులు ఎందుకు చేశారని ప్రశ్నించింది..? కాళేశ్వరం ప్రాజెక్టు నార్మల్ ప్రాజెక్టు కాదు.. ఇది ప్రత్యేకమైన గ్యారేజీ అని మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు.