NTV Telugu Site icon

Kaleru Venkatesh : అంబర్‌పేట అభివృద్ధిపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా..?

Kaleru Venkatesh

Kaleru Venkatesh

అంబర్‌పేట అభివృద్ధిపై వీలైతే కిషన్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని అంబర్‌పేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని చే నెంబర్ చౌరస్తా, మహంకాళి టెంపుల్, నింబోలి అడ్డా మహంకాళి టెంపుల్ ఎక్కడైనా సరే చర్చిద్దాం అని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఈరోజు బాగ్ అంబర్ పేట లోని బతుకమ్మకుంట, నందనవనం, శారద నగర్ తదితర కాలనీలలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తాను చేసిన అభివృద్ధి పనులను వివరించి ఓటు అడిగారు కాలేరు వెంకటేష్‌.

JNTU: కూకట్‌పల్లి జేఎన్టీయు వద్ద ఉద్రిక్తత.. ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన

నందనవనం కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఓటర్లు ఎక్కడకు వెళ్లిన పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారని అభివృద్ధిని చూసి ఓటు వేస్తామని చెప్పారని ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కాలేరు వెంకటేష్ అన్నారు. అయితే, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.. దీంతో ఈ మరోసారి అంబర్ పేటలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే నియోజకవర్గంలో అభివృద్ది సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

Supreme Court: ‘మూడేళ్లుగా గవర్నర్ ఏం చేస్తున్నారు?’.. తమిళనాడు బిల్లుల జాప్యంపై సుప్రీంకోర్టు