అంబర్ పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ బాగ్ అంబర్ పేట డివిజన్ లోని తురాభ్ నగర్, ఎరుకల బస్తీలో డివిజన్ ప్రెసిడెంట్ చంద్ర మోహన్ తో పాటు మహిళా నాయకులు, ముఖ్య నేతలు మరియు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ ప్రచారంలో బస్తీ వాసులు గులాబీ పూలతో పూల వర్షం కురిపిస్తూ కాలేరు వెంకటేష్ కు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు స్వాగతం పలికారు. బాగ్ అంబర్ పేటలోని నిర్వహించిన ఎన్నికల ప్రచార పాదయాత్రలో ప్రజలు ముఖ్యంగా యువకులు, మహిళలు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి బ్రహ్మరథం పడుతూ కోలాహల వాతావరణంలో ముందుండి నడుస్తూ, బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు నిర్వహించారు.
Read Also: Virat Kohli: నెదర్లాండ్స్ క్రికెటర్కు కోహ్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
ఇక, కాలేరు వెంకటేష్ ప్రజలందరితో మమేకమవుతూ.. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. అంబర్ పేటలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు నీరాజనం పడుతున్నారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ తోనే భరోసా వస్తుందని నమ్మి గొల్నక డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, మొహ్మద్ అక్బరుద్దీన్, ఇమ్రాన్, సమీర్, మహిళలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఇక, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.