అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి తో కలిసి బాగ్ అంబర్ డివిజన్ లోని బతుకమ్మ కుంటలో ప్రాంతాల్లో 75 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ పైప్ లైన్లు, ఆలయ పునర్నిర్మాణ పనులు, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో అంబర్ పేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని ఆన్నారు. బాగ్ అంబర్ పేట డివిజన్లో దశల వారీగా అన్ని ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నామని, ఈ ఒక్క రోజే 75 లక్షల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : Biggboss: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏకిపారేస్తున్న జనం
