Site icon NTV Telugu

Devika Case Judgement: దేవికా కేసులో నిందితుడికి జరిమానా, జీవిత ఖైదు

devika 1

Collage Maker 28 Feb 2023 04.26 Pm

2022 అక్టోబర్9న దేవికా అనే యువతిని దారుణంగా హతమార్చిన నిందితుడు సూర్యనారాయణకు జీవిత ఖైదు, జరిమానా విధించింది కాకినాడ కోర్టు…ఈ దారుణానికి ఒడిగట్టిన సూర్యనారాయణకు యావజ్జీవ కారాగార శిక్ష, 5000 జరిమానా విధించింది. తనను ప్రేమించడం లేదని దేవికాను అతి కిరాతకంగా నరికి చంపేశాడు ప్రేమోన్మాది సూర్యనారాయణ..144 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేశారు పోలీసులు. తీర్పు అనంతరం సూర్యనారాయణను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

కేసు వివరాల్లోకి వెళితే ప్రేమించిన మహిళను దారి కాచి అత్యంత కిరాతకంగా నరికి చంపిన ముద్దాయి. గుబ్బల వెంకట సూర్యనారాయణ కి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు కాకినాడ 3వ అదనపు సెషన్స్ జడ్జి. దిశ స్పూర్తితో కేసు దర్యాప్తు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అతి తక్కువ కాలం లో అనగా కేసు నమోదు జరిగిన కేవలం 144 రోజులలోపేజరిపి శిక్ష విధించింది కోర్టు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి చెంపపెట్టు గా త్వరితగతిన విచారణ జరిగిన తీరు అందరినీ ఆలోచింపచేసింది. మహిళల భద్రత విషయంలో నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం. గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర DGP గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో SP ఎం. రవీంద్రనాధ్ బాబు నిరంతర పర్యవేక్షణలో సత్ఫలితాలను ఇస్తుంది.

కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ. మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ. తనను ప్రేమించకుండా దూరం పెడుతుందనే అక్కసుతో కాదా దేవిక (21 సం.లు.. కూరాడ గ్రామం, కరప మండలం) అనే యువతిని పెదపూడి మండలం కాండ్రేగుల వద్ద ముద్దాయి గుబ్బల వెంకట సూర్యనారాయణ (27 సం.లు, బాలవరం గ్రామం, రంగంపేట మండలం) అను నతను 08 10. 2022 వ తేదీన ఉదయం 11.00 గంటల సమయంలో నడిరోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో నరికి చంపాడు.

ఈ ఘటనపై మృతురాలి చిన్నాన్న గుత్తులు బాలాజి ఇచ్చిన రిపోర్డు పై పెదపూడి పోలీసు స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 244 /2022 U/S 302 IPC గా కేసును ఎస్.ఐ. పి. వాసు నమోదు చేయడం జరిగింది. అనంతరం కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసు ఈ కేసు దర్యాప్తును చేపట్టడం జరిగింది. హత్య జరిగిన వెంటనే స్థానికుల సహకారంతో ముద్దాయిని అదుపులోనికి తీసుకుని 24 గంటల లోపే రిమాండు నిమిత్తం గౌరవ కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. దర్యాప్తులో భాగంగా పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి కోర్టు వారికి 7 పని దినాలలోపే ఛార్జిషీట్ ను గౌరవ కోర్టు వారికి సమర్పించడం జరిగింది. ఈ కేసులో హత్యా నేరం జరిగిన నాటి నుండి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు ప్రత్యేక శ్రద్ధ వహించి దర్యాప్తు అధికారికి విచారణ లో భాగంగా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి, నిర్ణీత సమయం లో రిపోర్టులు అనగా పోస్టుమార్గం. మొదలగునవి రావడానికి సిబ్బంది అధికారులను సంప్రదించి త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేయించారు. ఈ ఘటన రోజున ఉన్న అప్పటి కాకినాడ సబ్ డివిజనల్ ఇన్ ఛార్జి డీఎస్పీ వెంకటేశ్వరరావు, మొదట దర్యాప్తును పర్యవేక్షించగా తర్వాత కాకినాడ డీఎస్పీగా వచ్చిన పి.మురళీకృష్ణారెడ్డిగారు తదుపరి దర్యాప్తు నిర్వహించారు. కోర్టు విచారణను స్వయంగా పర్యవేక్షించారు.

Read Also: This Weekend Movies: ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ ఇవే!

జిల్లా అడిషనల్ ఎస్.పి.పి. శ్రీనివాస్ ఈ కేసు లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జిల్లా ఎస్.పి. గారి సూచనల ప్రకారం దర్యాప్తు కొనసాగేలా నిరంతరం ఫాలో అప్ చేయడం జరిగింది. కాకినాడ లోని గౌరవ 3వ అదనపు సెషన్స్ జడ్జ్ శ్రీమతి P. కమలాదేవి ఈ కేసు విచారణను 09.01.2023 వ తేదీన ప్రారంభించారు. కోర్టు విచారణ సమయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ఆదిత్య కుమార్ గారు ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించారు. సాక్షుల విచారణ, వాద ప్రతివాదనలు విన్న అనంతరం ముద్దాయిపై నేరం. ఋజువైనందున ముద్దాయికి ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 302 ప్రకారం. యావజ్జీవ కారాగార శిక్ష మరియు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ ఈరోజు 28-02-2023 వ తేదీన తీర్పునిచ్చారు. ముద్దాయిని కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం శిక్ష అమలుకు రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించడం జరుగుతుంది.

కేసులో దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తిచేసి, విచారణ సమయమందు కోర్టు వారి ఎదుట సాక్షులను సకాలంలో ప్రవేశ పెట్టి నేరస్తులకు శిక్ష పడడంలో శ్రమించిన కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాస్, పెదపూడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి. వాసు, ప్రాసిక్యూషన్ తరఫున పటిష్టమైన వాదనలను వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ఆదిత్య కుమార్ లను ఈ కేసు దర్యాప్తు సమయంలో దర్యాప్తు అధికారికి, కేసు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మంచి సహకారం అందించిన పెదపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది. AS-255 సుంకర శ్రీనివాసరావు, ASI-2437 వేములూరి శ్రీనివాస రావు, PC-1791 శ్రీ సవరపు గంగాధర్ లను జిల్లా ఎస్పీ శ్రీ M. రవీంద్రనాథ్ బాబు గారిని ప్రత్యేకంగా అభినందించారు.

Read Also:Revanth Reddy: పేదలకు మంచి జరగాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

Exit mobile version