వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటిలో విద్యార్థుల గోడవపై కేయూ వీసీ తాటికొండ రమేష్ తో కలిసి సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ రమేష్ మాట్లాడుతూ.. కేయూలో పీహెచ్డీ కేటగిరి-2 అడ్మిషన్ లలో ఎలాంటి అవకతవకలు జరుగలేదు అని ఆయన తేల్చి చెప్పారు. పారదర్శకంగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించామన్నారు. దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారు.. ప్రతిభ ఉన్నవారికే సీట్లు కేటాయించామని వీసీ రమేష్ తెలిపారు.
Read Also: Ram Gopal Varma: ఇండస్ట్రీ షేకింగ్ న్యూస్ .. కల్కిలో ఆర్జీవీ క్యామియో.. ?
మాకు కులం, మతంతో సంబంధం లేదు అని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ తెలిపారు. రూల్స్ కు అనుగుణంగానే సీట్లు కేటాయించాం..మొన్న డోర్లు తన్నుకుంటు, అసభ్యపదజాలంతో నా చాంబర్ కు వచ్చి కొందరు విద్యార్థులు గలాటా చేశారు అని ఆయన ఆరోపించారు. అక్రమ మార్గంలో PHD అడ్మిషన్లు పొందేందుకే ఇలా చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వీసీ రమేష్ పేర్కొన్నారు. ఈ గొడవపై వెంటనే పోలీసులకు సమాచారం అందించామని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Nadendla Manohar: ప్రభుత్వంలో ఎవరున్నా మంచి నిర్ణయాలను సమర్థిస్తాం..
పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియలో ఏవైన తప్పులు ఉంటే వేలెత్తి చూపండి.. లేదా లీగల్ గా వెళ్ళండి.. కానీ విచక్షణ రహితంగా దాడులు చేస్తే ఊర్కోం.. పీహెచ్డీ అడ్మిషన్లు మెరిట్ ప్రకారమే జరిగాయి.. బాధ్యతగల విద్యార్థులు దాడులు చేస్తారా? అంటూ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ రమేష్ తెలిపారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.