Site icon NTV Telugu

Kakarla Suresh: ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కాకర్ల సురేష్..

Kakarla

Kakarla

నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన సీతారాంపురం పరిధిలోని చిన్నగంపల్లి నుంచి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రచార కార్యక్రమం నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న ఆయనకు మహిళలు హారతి ఇచ్చి సాదరంగా ఆహ్వానించా రు. ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా తనను గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కాకర్ల ఈ సందర్భంగా కోరారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళలు తన వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు అని ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.

Read Also: Konda Vishweshwar Reddy: నా ప్రత్యర్థి ఎవరో నాకు ఇప్పటికీ తెలియడం లేదు..

అలాగే, ఉదయగిరి మండలం వెంగళరావు నగర్ లో రంజాన్ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని దీక్ష భూనిన ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులు కాకర్ల సురేష్ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ రంజాన్ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని దీక్ష చేస్తున్న వారందరూ విజయవంతంగా దీక్షను పూర్తి చేయాలన్నారు. అల్లా వారి కోర్కెలను నెరవేర్చాలని ప్రార్థించారు. ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు కాకర్ల సురేష్ తెలియజేశారు.

Exit mobile version