NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: జగనన్నే మా భవిష్యత్తుకి విశేష స్పందన

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ సంక్షేమ పథకాలు చేపడుతున్నామని, అందుకే ప్రజల నుంచి వైసీపీ పాలనకు ప్రశంసలు లభిస్తున్నాయన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. మెగా పీపుల్స్ సర్వేకి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇప్పటికే కోటి 60 లక్షల కుటుంబాలను పార్టీ శ్రేణులు కలిశాయి. ప్రతి ఇంటికి వెళ్లి వారిని పలకరించాం. అందరూ కలిసి కట్టుగా పని చేశాం. నెల్లూరు జిల్లాలో విజయవంతంగా చేస్తున్నాం అన్నారు మంత్రి కాకాణి.

ఎవరి జోక్యం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.అర్హత కలిగిన వారికి సచివాలయం ద్వారా పథకాలు ఇస్తున్నాం అన్నారు. సీఎం జగన్ వల్ల మంచి కలిగిందని ప్రజలు చెబుతున్నారు. ప్రజల్లో స్పందన చూసి టిడిపి నేతలకు నిద్ర రావడం.లేదు. కొన్ని మీడియాలను అడ్డు పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. టిడిపి కార్యకర్తలు..సానుభూతి పరులు కూడా ప్రభుత్వ పథకాలపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము ఏడాది నుంచి ధైర్యంగా ఇంటింటికీ వెళుతున్నాం అన్నారు మంత్రి కాకాణి.

Read Also: Shahrukh Khan : షారూఖ్‎కు షాక్.. కోర్టు ఏమన్నదంటే

పార్టీల‌కు అతీతంగా ఇవాళ ప‌థ‌కాల వ‌ర్తింపు అన్నది చేస్తున్నాం. క‌నుక విమ‌ర్శలు మానుకోండి. అభివృద్ధికీ, సంక్షేమానికీ సహ‌క‌రించండి. ఒక‌వేళ మేం త‌ప్పులు చేస్తే మా దృష్టికి తీసుకు రండి. త‌ప్పులు దిద్దుకుంటాం. స‌ల‌హాలు ఇవ్వండి. మంచి స‌ల‌హాలు ఇవ్వండి. అంతేకానీ పొద్దున అయితే చాలు జ‌గ‌న్ ను ప్ర‌జ‌ల నుంచి ఏ విధంగా దూరం చేయాలి. ఈ ప్రభుత్వం ధ‌నికుల కోసం కాదు పేద ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని వారి కోసం ప‌ని చేస్తున్నాం. మ‌హిళ‌ల కోసం ప‌నిచేస్తున్నాం. అవ్వా తాత‌ల కోసం ప‌నిచేస్తున్నాం. నెల రోజుల ముందు గడ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాం. అద్భుతంగా ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, ల‌బ్ధిదారుల‌ను క‌ల‌వగ‌లిగాం. ద‌య‌చేసి మేలు చేసే ప్రభుత్వానికి మ‌ద్దతుగా నిల‌వ మంటున్నారు వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు.

Read Also: CM JaganMohanReddy: సూడాన్ బాధితులకి అండగా నిలబడదాం

Show comments