NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: దేశంలో చెప్పుకోదగ్గ రైతు పక్షపాతి.. జగన్

Kakani Govardhan Reddy 1200x800

Kakani Govardhan Reddy 1200x800

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. హార్టికల్చర్ పరిశోధన కేంద్రానికి అదనంగా త్వరలో ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నాయకులకు లేదా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్న నాయకులకు మాత్రమే రైతు రథాలు ఇచ్చారు. 1/3వంతు రైతుకి అందిస్తే… 2/3వ వంతు వాళ్ళ జేబులలోకి వెళ్లిందన్నారు. టీడీపీ రైతులకు ఏం చేసిందో చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డిపై కక్ష కట్టి బురద జల్లుతోందన్నారు మంత్రి కాకాణి.

Read Also: Botsa Satyanarayana: రుషికొండలో సీఎం నివాసం కడితే తప్పేంటి?

దేశంలో చెప్పుకో దగ్గ రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి. చ౦ద్రబాబు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయలేకపోయాడన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు విలయ తాండవం చేస్తుంది. చ౦ద్రబాబు పాలనలో వ౦దల స౦ఖ్యలో కరువు మ౦డలాలు ప్రకటించవలసి౦దే. జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ఒక్క మండలం కూడా కరువు మండలంగా లేదు. చ౦ద్రబాబుకు అల్జీమర్ వ్యాధి ఉంది. నిన్న చెప్పింది ఈరోజు గుర్తు౦డదు. రైతులు గతాన్ని మర్చిపోయుంటారేమో అనుకుని మల్లీ తనకు అవకాశం ఇస్తారేమో అని ఆలోచిస్తారు. మధ్య దళారీలు లేకుండా మీట నొక్కితే నేరుగా అకౌంట్ లలో పడేలా వినూత్న కార్యక్రమం చేపట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుంది. కేంద్రం కూడా రాష్ర్టంలో అమలౌతున్న పథకాల చూసి దేశవ్యాప్తంగా అమలుచేస్తుందన్నారు.

Read Also: Mukesh Ambani Security Cover Increased: ఇంటలిజెన్స్ రిపోర్ట్.. ముఖేష్ అంబానీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ