కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్సింగ్స్ లో దూసుకుపోతుంది. ఒక వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూనే తన హాట్ అందాల తో రెచ్చగొడుతుంది., కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు తల్లి అయిన కూడా తనలోని అందాలు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది.. గ్లామర్ డోస్ పెంచుతూ పిచ్చెక్కిస్తుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి..ఇందులో ఘాటైనా అందాలతో కాజల్ కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది..హాట్ డ్రెస్ లో దేవకన్య లా మెరిసింది.. భారీ డిజైనింగ్ వేర్‌లో అందాల రాకుమారి లా కనిపించింది కాజల్.ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి.కాజల్ అగర్వాల్ దాదాపు రెండు దశాబ్దాలపాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది..తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
కాజల్ తెలుగుతోపాటు తమిళం మరియు హిందీ సినిమాలు కూడా చేసింది.మిగతా ఇండస్ట్రీ ల లో చేసిన కానీ ఈ భామకు తెలుగులో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది అంతేకాదు తెలుగు ఆడియెన్స్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం కాజల్ బాలకృష్ణతో కలిసి `భగవంత్ కేసరి` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతో మొదటి సారి బాలకృష్ణతో కలిసి నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న `ఇండియన్ 2` సినిమా లో కూడా నటిస్తుంది.మొదటి సారి విశ్వనటుడు కమల్ హాసన్ సరసన నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.కాజల్ అగర్వాల్ ఈ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీ `సత్యభామ` చిత్రంలో కూడా నటిస్తుంది.ఇలా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.