NTV Telugu Site icon

Satyabhama Movie: టాప్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’!

Satyabhama Trending

Satyabhama Trending

Kajal Aggarwal’s Satyabhama Gets Huge Response on OTT: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సత్యభామ’. ఈ సినిమాకు సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించగా.. అవురమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు. ‘మేజర్‌’ దర్శకుడు శశికిరణ తిక్క సమర్పించారు. ఇందులో నవీన్‌చంద్ర, అమరేందర్‌, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ కీలక పాత్రలు పోషించారు. సత్యభామ చిత్రం జూన్‌ 7న థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచుకుంది.

Also Read: Indian Cricket Team: ప్రధాని మోడీతో భేటీ.. స్పెషల్ జెర్సీలో భారత ప్లేయర్స్!

సత్యభామ సినిమా జూన్‌ 28 నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్‌లో సైతం హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇండియా వైడ్ నెంబర్ 1 ప్లేస్‌లో సత్యభామ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా అతితక్కువ సమయంలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘సత్యభామ’గా కాజల్ అగర్వాల్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఓ హత్యకేసులో ఎమోషనల్ అయిన సత్యభామ.. ఆ కేసును ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఎలా సాల్వ్ చేసింది, బాధితురాలికి ఎలా న్యాయం చేసిందనేది ఈ సినిమాలో హార్ట్ టచింగ్‌గా, ఇంటెలిజెంట్‌గా చూపించారు. సత్యభామలో కాజల్ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అయ్యాయి.

Show comments