Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అందం,అభినయంతో ప్రేక్షకులను కాజల్ ఎంతగానో ఆకట్టుకుంది.కాజల్ టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.కాజల్ తెలుగు తో పాటు తమిళ్,హిందీ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.అయితే కెరీర్ ఫుల్ పీక్స్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.వీరిద్దరి జంటకు ఓ బాబు కూడా కలగడంతో కాజల్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వుంది.తాజాగా కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం కాజల్ నటించిన లేడి ఓరియెంటెడ్ మూవీ సత్యభామ ఈ నెలాఖరుకు రిలీజ్ అవుతోంది. దీనితో కాజల్ వరుస ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.అయితే పెళ్లి తర్వాత అవకాశాలు రావడంపై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పెళ్ళైతే హీరోయిన్ల కెరీర్ ముగిసినట్లే అనే అభిప్రాయాన్ని కాజల్ తప్పని భావించారు. కాజల్ మాట్లాడుతూ పెళ్లి తర్వాత నా కెరీర్ లో ఎలాంటి మార్పు లేదు. బాలీవుడ్ లో పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.అయితే ఈ విషయంలో టాలీవుడ్ లో మాత్రం ఇంకా మార్పు రాలేదు. ఇక్కడ పెళ్ళైన హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ ఎంతగానో ఆలోచిస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్ లో కూడా మార్పు వస్తుంది. అందుకు ఉదాహరణ నేనే అని కాజల్ తెలిపింది.నా భర్త నాకు ఎంతో సపోర్టివ్ గా వుంటారు.ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ వుంటారు.నేను ఎంత బిజీ గా వున్నా కూడా నా ఫ్యామిలీ కి సమయం కేటాయిస్తాను అని కాజల్ తెలిపింది.