Site icon NTV Telugu

Kaikala Satyanarana : నేడు అధికార లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

Kaikala

Kaikala

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ సినీ లోకం ఆవేదన చెందుతోంది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇవాళ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికారికంగా జరపనున్నారు. వయోభారంతోపాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌‌‌‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే.. నేడు ఉదయం 10.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి.
Also Read : Sabarimala Yatra: లోయలో పడిన శబరియల యాత్రికుల వాహనం.. 8మంది భక్తులు మృతి

అయితే.. కైకాల 60 సంవత్సరాల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.

Exit mobile version