బీజేపీపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బీజేపీ .. బద్మాష్ పార్టీ అని… తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతులు పండించిన పంటను ఎఫ్ సీఐ కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ల లో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి తెలంగాణ ధాన్యం కొనుగోలు పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసలు బీజేపీ పార్టీ ఒక పార్టీయేనా అని ఆగ్రహించారు కడియం శ్రీహరి.
