NTV Telugu Site icon

Kadiyam Srihari : ఎమ్మెల్యే రాజయ్య తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు

Kadiyam Srihari

Kadiyam Srihari

ఎమ్మెల్యే రాజయ్య కామెంట్స్ పైనా కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజయ్య తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలు చేశారని, నా పుట్టుక పైనా. నా కూతురు పైనా ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్స్ మనస్తాపానికి గురిచేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని, ఈ విషయం పైన అధిష్టానం దృష్టి కి తీసుకెళ్లానని, అధిష్టానం సూచన మేరకు నేను సమన్వయం పాటించానన్నారు. ఎమ్మెల్యే అయిన రాజయ్య సభ్యత నేర్చుకుంటారు అని అనుకున్నామని, తండ్రి కులమే కొడుకు వస్తుంది అని సుప్రీంకోర్టు కోర్టు తీర్పు ఉందన్నారు.
రాజయ్య మహిళకూ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తల్లి సత్యం తండ్రి అపోహా అని చేసిన కామెంట్స్ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు కోర్టు తీర్పు తో నేను ఎస్సీ, నా తల్లి బీసీ. నా తండ్రి ఎస్సీ అని, నేను ఎస్సీ అవుతే నా కూతురు కూడా ఎస్సీనే అవుతుందని, ఈ న్యాయ సూత్రాలు తెలియని నీవు ఎమ్మెల్యే గా ఎలా ఉన్నావని ఆయన ధ్వజమెత్తారు. నేను ఎన్ కౌంటర్ సృష్టింకర్త అన్నావు నేను కేవలం మంత్రి మాత్రమేనని, నేను హోమ్ మంత్రిని కాదు ఎన్ కౌంటర్‌కు నేను ఎలా బాధ్యుడను అవుతానని ఆయన ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ల సృష్టికర్త అన్న రాజయ్య క్షమాపణ చెప్పాలన్నారు. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయి అని ఆరోపిస్తున్న రాజయ్య.. నాకున్న ఆస్తుల వివరాలు చెప్పాలన్నారు. ఆ ఆధారాలు చూపిస్తే వాటిని ఘనపూర్ నియోజకవర్గం దళిత బిడ్డలకు పంచుతామని ఆయన సవాల్‌ చేశారు.

Also Read : Governor Tamilisai : గవర్నర్ కార్యాలయంలో ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవు

వారం రోజుల్లో ఆ ఆస్తుల వివరాలు తేవాలి లేక పోతే క్షమాపణ చెప్పాలని ఆయన వెల్లడించారు. వారం రోజుల సమయం ఇస్తున్నానని, ఎమ్మెల్యే రాజయ్యకి నన్ను చుస్తే భయమని ఆయన అన్నారు. నన్ను పిలిస్తే కదా వచ్చేదని, పార్టీ కార్యక్రమం నన్ను పిలువరని ఆయన అన్నారు. నన్ను పిలవకుండా ఎలా వస్తానని, 3 దశాబ్దాల కాలంలో ఏదైనా పని చేసిన కడియం శ్రీహరి డబ్బులు తీసుకొని పని చేశాడు అని ఎవ్వరైనా చెబితే నేను స్టేషన్ ఘనపూర్ లో రాజకీయ జోలికి రానని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రాజయ్య వల్ల దళితులు ఎంత నష్టపోతున్నారో నీకు తెలుసా.. నీవు బి ఫామ్ అమ్ముకోలేదా… దళిత బంధు ఇస్తా అని డబ్బులు తీసుకున్నావా లేదా.. సమయం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళను బయటకు తీసుకొస్తా ప్రెస్ మీట్ చేస్తా.. నా కూతురు పోటీ చేస్తా అని ఎక్కడైనా చెప్పిందా.. నీ దగ్గర టికెట్ కోసం వచ్చిందా.. రాజకీయాల్లోకి పిల్లలను ఎందుకు తెస్తున్నావు’ అంటూ కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Jawan: జవాన్ లో విజయ్.. ఇదుగో సాక్ష్యం..?