NTV Telugu Site icon

MLA Sidda Reddy: సీఎం జగన్‌ టూర్‌కు దూరంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. కారణం అదేనా..?

Sidda Reddy

Sidda Reddy

MLA Sidda Reddy: ఎన్నికల ప్రచారం ఉధృతం చేసిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్.. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు.. ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది.. ఓవైపు ప్రజల నుంచి సీఎం జగన్‌ యాత్రకు అపూర్వ స్వాగతం లభిస్తుంటే.. కొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం సైడైపోతున్నారు.. సోమవారం రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరిగింది.. అయితే, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి. నిన్న కదిరిలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రోడ్ షోలో కదిరి ఎమ్మెల్యే కనబడలేదు..

Read Also: Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో తగ్గిన నీటి మట్టం.. కాకతీయ ఆయకట్టుకు నీరు నిలిపివేత..

అయితే, కదిరి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు సిద్ధారెడ్డి.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తనకు మరోసారి టికెట్‌ వస్తుందని ఆశించిన ఆయనకు సీఎం వైఎస్‌ జగన్‌ షాకిస్తూ.. మరో అభ్యర్థికి అవకాశం ఇచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేసిన వైసీపీ అధిష్టానం.. కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్ధారెడ్డిని కాదని మగ్భూల్ అహ్మద్ పేరును ప్రకటించింది.. ఇక, ఈ పరిణామాల అనంతరం పార్టీతో అంటీముంటనట్లుగా వ్యవహరిస్తున్నారు సిద్ధారెడ్డి.. కనీసం, సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనకైనా ఆయన వస్తారని అంతా భావించారు.. కానీ, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సైతం ఆయన దూరంగా ఉన్నారు. దీంతో, సిద్ధారెడ్డి మనసులో ఏముంది.. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీకి రాజీనామా చేసిన వెళ్లిపోయిన తరుణంలో.. సిద్ధారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనే చర్చ ఆసక్తికరంగా మారింది.