Kadapa’s Gandikota Minor Girl Murder: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి పది రోజులు కావస్తున్నా..ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. మైనర్ బాలికను ఆమె ప్రియుడు గండికోట ముఖద్వారం వద్ద వదిలి వెళ్ళిన తరువాత గండికోటలోని మాధవరాయ స్వామి గుడికి వెళుతున్న ఫోటోలు ఇప్పుడు ఎన్‌టీవీ చేతికి చిక్కాయి.. మొదట మాధవరాయ స్వామి గుడికి వెళ్లి, ఆ తరువాత రంగనాయక స్వామి గుడిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు… రంగనాయక స్వామి గుడి ముఖ ద్వారం వద్ద బాలిక తీసుకెళ్లిన స్కూల్ క్యారియర్ మొదట పోలీసులకు లభించింది..
ఆ తర్వాత కొంత దూరంలో బాలిక చున్ని పోలీసులు కనుగొన్నారు. రంగనాయక స్వామి గుడి ముందు భాగంలో బాలిక బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు.. రంగనాయక స్వామి గుడికి పూర్తిగా వెనుక భాగంలోని ముళ్లఫొదల్లో మైనర్ బాలిక శివమై తేలింది.. బాలిక గుడిలోకి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె వెంట వెళ్ళినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు… అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు బాలిక వెంట వెళ్లారు అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.. అయితే మైనర్ బాలిక దారుణ హత్యగామించబడి నేటికీ పది రోజులు కావస్తున్న హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు..
READ MORE: Pakistan: పాక్ మిస్సైల్ విఫలం.. సొంత ప్రజలపైనే కూలిన షాహీన్-3 క్షిపణి..
