Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ ఓఎస్డీగా కడప ఆర్డీవో..

  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఓఎస్డీగా ఆర్డీవో మధుసూదన్‌ నియామకం..
  • కడపతో పాటు ధర్మవరం ఆర్డీవోగా పని చేసిన మధుసూదన్‌..
Madhusudan

Madhusudan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పర్సనల్ సెక్రెటరీ (ఓఎస్డీ)గా కడప ఆర్డీవో మధుసూదన్‌ను నియమించారు.. కడపతో పాటు ధర్మవరం ఆర్డీవోగా కూడా పనిచేశారు మధుసూదన్‌.. ఈ సంద్భంగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చిన ఆర్డీవో మధుసూదన్.. తనను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.. ఇక, పవన్‌ కల్యాణ్ ఓఎస్డీగా బాధ్యతలు తీసుకున్నారు మధుసూదన్.. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు తీసుకున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. వరుసగా తన శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోన్న ఆయన.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, ఉన్న నిధులు.. చేయాల్సిన పనులపై చర్చిస్తున్నారు.. మరోవైపు.. ఈ మధ్యే.. తన సొంత నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పవన్‌ కల్యాణ్ పర్యటన కొనసాగింది.. జిల్లాలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. వారాహి సభల ద్వారా పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన విషయం విదితమే.

Read Also: Amarnath Yatra : వర్షం కురిసినా తగ్గేదేలే.. వారం రోజుల్లో 1.25లక్షల మంది శివుడిని దర్శించుకున్న భక్తులు