Site icon NTV Telugu

Mayor Suresh Babu: కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ.. నా ఇష్టం అంటున్న మేయర్!

Mayor Suresh Babu

Mayor Suresh Babu

కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సమావేశం ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. దాంతో సర్వసభ్య సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, 8 మంది టీడీపీ కార్పోరేటర్లు, అధికారులు కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో వేచి ఉన్నారు. మరోవైపు మేయర్ చాంబర్‌లో వైసీపీకి చెందిన 39 మంది కార్పోరేటర్లు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనే అంశలో సందిగ్దత నెలకొంది.

కార్పొరేషన్ ప్రాంగణంలో ఎక్కడైనా నిర్వహించుకునే అధికారం తనకు అంది మేయర్ సురేష్ బాబు అంటున్నారు. సమావేశం మందిరంలో నిర్వసించాలని అధికారులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే సమావేశ మందిరంలో అధికారులు ఎదురు చూస్తున్నారు. మేయర్ తన చాంబర్‌లో కార్పొరేటర్‌లతో భేటీ అయ్యారు. సమావేశ వేదికను మార్చాలంటూ మేయర్ డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ మీటింగ్ అనేది తన ఇష్టం అని, అజెండా అంశాల కాపీలను అందరికీ ఇచ్చాం అని మేయర్ అంటున్నారు. తాము ఎక్కడ సమావేశం నిర్వహించినా అధికారులు రావాల్సిన బాధ్యత ఉందన్నారు.

Also Read: Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారుల కసరత్తు!

‘కడప మున్సిపల్ కమిషనర్ నా అనుమతి లేకుండా అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ అయిన నాకు తెలియకుండా వేదికపైన ఎమ్మెల్యేకి కుర్చీలు వేశారు. సమావేశం హాల్ తెరవమని కోరినా తెరవలేదు. జనరల్ బాడీ మీటింగ్‌పై కమిషనర్‌కూ చెప్పా. ఎక్కడ అని కమిషనర్‌ అడగలేదు. ఎక్కడ మీటింగ్ అనేది నా ఇష్టం. అజెండా అంశాల కాపీలను అందరికీ ఇచ్చాం. సమావేశంపై కమిషనర్‌ నాతో చర్చించలేదు. కమిషనర్‌ నాకు తెలియకుండా రాత్రి హాల్ తెరిచారు. కార్పోరేటర్లకు కమిషనర్‌ క్లారిటీ ఇవ్వలేదు. మేము ఎక్కడ నిర్వహించినా అధికారులు రావాల్సిన బాద్యత ఉంది’ అని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు.

Exit mobile version