NTV Telugu Site icon

Dental Student Suicide: మెడికో లవ్‌.. హౌస్‌ సర్జన్‌ మోసంతో ఆత్మహత్య..

Suicide

Suicide

Dental Student Suicide: కొన్ని ప్రేమలు పెళ్లి పీటల వరకు వెళ్తాయి.. కొన్ని ప్రేమలో మధ్యలోనే తెగదెంపులకు వెళ్తాయి.. మరికొన్ని ప్రేమలు విషాధాన్ని నింపుతాయి.. నమ్మిన వ్యక్తి మోసం చేయడంతో.. మరికొందరు తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుంటారు.. తాజాగా, నంద్యాలలో ప్రేమించి మోసపోయానంటూ ఆత్మహత్యాయత్నం చేసిన డెంటల్ విద్యార్థిని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు టూటౌన్‌ పోలీసులు..

Read Also: Chandrayaan-3: ఏం చేసినా ఈ 14 రోజుల్లోనే.. ఆ తర్వాత విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్ ఏమవుతాయి?

నంద్యాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెడిసిన్ చదువుతోన్న విద్యార్థిని శ్రావణిని ప్రేమించి మోసగించాడట హౌస్‌ సర్జన్‌ డా. ధీరజ్ కుమార్.. పెళ్లికి నిరాకరించడంతో విషయం తాగి ఆత్మహత్యయత్నం చేసింది విద్యార్థిని శ్రావణి.. కడపలోని మెడికల్ కాలేజీలో డెంటల్ చదువుతున్న శ్రావణి, ఈఐఎంఎస్ పూర్తిచేసి హౌస్ సర్జన్ చేస్తున్న ధీరజ్ కుమార్‌తో లవ్‌లో పడిపోయింది.. ధీరజ్ కుమార్ సమీప బంధువు కూడా కావడంతో.. అతడి మాయమాటలు నమ్మిన శ్రావణి.. ప్రేమలో మునిగిపోయింది. అయితే, పెళ్లి చేసుకోమని అడిగితేగానీ ధీరజ్‌కుమార్‌లోని మరో యాంగిల్‌ బయటకు రాలేదు.. ఎంబీబీఎస్‌ చదివినవారిని మాత్రమే తాను పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు ధీరజ్ కుమార్.. మనస్తాపానికి గురైన శ్రావణి.. ఈ నెల 16వ తేదీన విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. నంద్యాల ఇన్సెంటివ్ ట్రామా సెంటర్‌లో 8 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.. దీంతో ధీరజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు టూ టౌన్ పోలీసులు.