Site icon NTV Telugu

KA Paul: ఒక్క ఛాన్స్ ఇవ్వండి జగన్ గారు.. ఏపీకి పెట్టుబడులను తీసుకు వస్తా..!

Ka Paul

Ka Paul

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లా మీటింగ్ ఉత్తరాంధ్రలో జరిగింది.. కొందరు ఎన్టీ రామారావు తో లోకేషన్ పోలిస్తున్నారు.. ఇదేం పోలిక, కనీసం పెద్ద ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చండి అని ఆయన చెప్పారు. నేను సత్యం మాత్రమే మాట్లాడతాను.. చంద్రబాబుకు లోకేష్ కు 10 ప్రశ్నలు అడుగుతున్నాను.. ముఖ్యమంత్రి అయ్యేందుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు నిజమా కాదా అని ఆయన అడిగారు. ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం 50 కోట్లు అడిగారా లేదా.. టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా లోకేష్ ను చేస్తారు కాదా.. ఏపీని సింగపూర్ అని చెప్పి ఉప్పల ఆంధ్రాని చేశారు.. ఇప్పుడున్న అప్పులను ఎలా తీరుస్తారో నాతో చర్చకు రావాలి అంటూ కేఏ పాల్ సవాల్ విసిరారు.

Read Also: Bhatti Vikramarka: విద్యుత్ రంగంలో అరాచకం సృష్టించారు..

జాబు రావాలంటే బాబు రావాలని అబద్ధాలు చెబుతున్నారు అంటూ కేఏ పాల్ అన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు.. చంద్రబాబుకు బిల్ క్లింటన్, బిల్గేట్స్ ను నేనే పరిచయం చేశా.. రైతులకు రుణమాఫీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి మహిళలకు ఉచిత బస్సు వైద్యం వీటన్నిటి గురించి వాగ్దానాలు చేస్తున్నారు.. లక్షా 50 వేల కోట్ల రూపాయలను ఎక్కడినుంచి తీసుకొస్తారు జవాబు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రలో తారకరత్న చనిపోయారు.. ఆయన చావుకు సంబంధించినటువంటి విషయంలో సీబీఐ విచారణకు మీరు రెడీయా అని పాల్ అడిగారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: జగన్ ను గద్దె దించటం పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యం

మాటలు రాని లోకేష్ చేతలు ఎలా చేయగలడు పనులు ఎలా చేయగలడు అంటూ కేఏ పాల్ మండిపడ్డారు. జనాలు డబ్బులు ఇవ్వగానే పశువుల్లా వెళ్లారు చంద్రబాబు లోకేష్ సభకు.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అసలు జగన్ ఎలా నడుపుతున్నారో అర్థం కావడం లేదు.. వేరే వాళ్లయితే సూసైడ్ చేసుకునే వాళ్ళు అని ఆయన చెప్పారు. అందరూ నన్ను కోరుకుంటారు.. పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరుతున్న నాకు సమయం ఇవ్వండి కలిసి మాట్లాడుదాం.. జగన్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో పెట్టబడులు పెట్టేందుకు కోట్ల రూపాయలు తీసుకు వస్తాను అని ఆయన పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చి నేను చెప్పినట్టు వింటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు లేదంటే నా పేరు మార్చుకుంటాను.. నేను ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధం.. చంద్రబాబు కళ్లు నెత్తికొచ్చాయి.. లోకేష్ వాళ్ళ నాన్నే కదా ఎన్టీఆర్ ను చంపింది.. టీడీపీకి రియల్ వారసులైన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లకు టీడీపీని అప్పగించాలి.. మోడీతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన దాని ప్రభావం లేదు.. జగన్ ఓడిపోవాలని నేను ప్రేయర్ చేయలేదు ఆయన బాగుండాలనే నేను ప్రేయర్ చేశాను అని కేఏ పాల్ వెల్లడించారు.

Exit mobile version