KA Paul: పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ ఒక పిల్ వేశానని.. హైకోర్టు ఒపీనియన్ తీసుకుని రావాలని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నిన్న హైకోర్టులో ఛీఫ్ జస్టిస్ విచారణ జరిపారని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. PPP బదులుగా PPB (బిలియనీర్ల ప్రోగ్రామ్) అనాలన్నారు. మెడికల్ కాలేజీలను కొనేది నారాయణ కావచ్చు, ఎవరైనా కావచ్చు వదిలిపెట్టనని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా.. కర్ణాటక రాష్ట్రంలో ఇదే పీపీపీ విధానంతో నష్టపోయారు.. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని పాల్ తెలిపారు. గ్లోబల్ హాస్పిటల్ లో ఒక 29 ఏళ్ళ మహిళ మరణించిందని.. బస్సు యాక్సిడెంట్ జరిగితే యజమానులను అరెస్టు చేయరని ప్రశ్నించారు. పాలించడం రాకపోతే రాజీనామా చేయండి.. నాకు తెలుసు ఎలా పాలించాలో అన్నారు.
READ MORE: Mega 158 : మెగా 158’ కోసం..టాప్ టెక్నీషియన్ జాయిన్!
విశాఖపట్నం సమ్మిట్ లో లక్ష కోట్లు వస్తాయంటే.. శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు కేఏ పాల్.. “గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు.. హైకోర్టులో నా పిల్ కొట్టేయలేదు.. అదే జరిగితే సుప్రీంకోర్టుకు వెళతాను.. 33 సంవత్సరాల లీజు పేరుతో స్టీలు ప్లాంటు అమ్మేస్తున్నట్టు మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. క్యూబా లాంటి దేశంలోనే ఉచిత విద్య, వైద్యం ఉంది.. ప్రధాని, సీఎంలకు రూ.5వేల కోట్లు రావడం లేదా.. ఉత్తినే నారాణయణ లాంటి వారికి మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తారా..? ఒకడు మొన్ననే ఎమ్మెల్సీ అయ్యాడు.. వాడికీ హెలికాప్టర్ అట.. FCRA అధికారిక పర్మిషన్లు లేవు నాదగ్గర.. మీరు సంతకం పెట్టండి.. నేను 5వేల కోట్లు రెండు వారాల్లో ఇస్తా.. సుగాలి ప్రీతి కోసం మాట్లాడరెందుకు పవన్ కళ్యాణ్.. స్టీల్ ప్లాంట్ అమ్మడానికి అదాని నన్ను కలిశాడు..
జగన్ నన్ను ఎప్పుడూ కష్టపెట్టలేదు.. చంద్రబాబు ఇంకా నా బ్లెస్సింగ్స్ తీసుకోవడం లేదు..” అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
