NTV Telugu Site icon

KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు.. కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

Ka Paul

Ka Paul

KA Paul: తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్‌గా ఉన్న ప్రజాశాంతి పార్టీని యాక్టివ్‌గా లేదని అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు వస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయని కేఏ పాల్‌ పేర్కొన్నారు. సీఈవో వికాస్ రాజ్, డిప్యూటీ సీఈవో సత్యవాణి తమ ఉద్యోగాలు పోయినా పర్లేదు అని నిజాలు చెప్పారని ఆయన అన్నారు.

Also Read: MLC Jeevan Reddy : దళితులకు చెందాల్సిన 40 వేల కోట్లను కేసీఆర్‌ పక్కదారి పట్టించిండు

ఒక చిన్న పార్టీకి సింబల్ ఇవ్వలేదని లద్ధాఖ్ ఎన్నికలు రద్దు చేశారని.. ఈ క్రమంలోనే తన పార్టీకి సింబల్ అండ్ ఇనాక్టివ్ చేసినందుకు కోర్టులో పిటిషన్ వేస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. డోంట్ ఓట్ లేదా ఓట్ నోటా ట్యాగ్‌తో ప్రజల్లోకి వెళ్తామన్నారు. అంబేడ్కర్‌ అండ్ గద్దర్ ఆశయాలను నెరవేర్చుకుందామని ప్రజలకు సూచించారు. ప్రజాశాంతి పార్టీ పోటీలో లేదు కాబట్టి ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని కోరారు. మంద కృష్ణ మాదిగకు మోడీ కోట్లు ఇచ్చి సభ పెట్టించారని ఈ సందర్భంగా ఆరోపణ చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.

 

Show comments