Site icon NTV Telugu

KA Paul: నన్ను విశాఖ ఎంపీగా గెలిపించండి.. కేఏ పాల్ విన్నపం

Ka Paul

Ka Paul

KA Paul: ఏపీ ప్రజలకు సీఎం జగన్ నమ్మక ద్రోహం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. సొంత తల్లిని, చెల్లెలిని కూడా మోసం చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. ఆనాడు షర్మిల పాదయాత్ర చేయకపోతే జగన్ అధికారంలోకి వచ్చేవాడా? అని ప్రశ్నించారు. ఈరోజు నుంచి జగన్ పై యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పారు. జగన్, విజయసాయిరెడ్డి జైలుకి వెళ్లేవారేనని అన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను తాను కలిశానని… తనకు గౌరవం ఇవ్వని నాయకులు చంద్రబాబు, జగన్ అని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కావాలో, సర్వ అభివృద్ధి చేసే తాను కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేఏ పాల్ అన్నారు. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ, జీవీఎల్ పోటీ చేయవద్దని కోరుతున్నానని చెప్పారు. బొత్స ఝాన్సీ పోటీ చేస్తే బొత్స అవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరించారు. జనసేనలో టికెట్ రాని నేతలంతా ప్రజాశాంతి పార్టీలో చేరుతారని అన్నారు. తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ముందు షర్మిలా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని తానే చెప్పానన్నారు.

Read Also: Kodali Nani: ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు

కేఏ పాల్‌ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్‌కి భారత రత్న ఇవ్వకపోవడం దారుణం. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉంటే భారతరత్న వచ్చేది. ఇవాళ్టి నుంచి సీఎం జగన్‌తో నేను యుద్ధం ప్రకటిస్తున్నాను. మోడీ తొత్తుల పాలన కావాలా? ప్రజా సంక్షేమ కోరే ప్రజా శాంతి పార్టీ కావాలా నిర్ణయించుకోండి. నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు పర్మినెంట్ జీతాలు ఇస్తా.. 2 లక్షల మంది వాలంటీర్లకు 20 వేలు జీతం ఇచ్చి పర్మినెంట్ చేస్తాను. నన్ను విశాఖ ఎంపీగా గెలిపించండి. జనసేన నుంచి టికెట్ రాని అభ్యర్థులు అంతా ప్రజాశాంతిలో పార్టీలో కలుస్తారు.” అని ఆయన అన్నారు.

Exit mobile version