Site icon NTV Telugu

K.A. Paul: ఏపీకి వస్తున్న.. నన్ను ఆపడం ఎవరి తరం కాదు..

K.a. Paul

K.a. Paul

K.A. Paul: బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. తాజాగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసు రెండో కోర్టులో లిస్ట్ అయిందని.. కానీ కోర్టుకు సెలవిచ్చారన్నారు. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని, కోర్టుకు సెలవు ఇస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్లకు న్యాయం జరగాలన్నారు. బెట్టింగ్ యాప్స్ పై సీబీఐ విచారణ జరగాలన్నారు. సుప్రీంకోర్టులో బెట్టింగ్ ఆప్స్ కేసు విచారణ లిస్ట్ అయినా.. కోర్టు షట్ డౌన్ చేస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో బలవుతున్నారని చెప్పారు. ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు.

READ MORE: Mohanlal : మలయాళ సినిమా రికార్డులు తిరగరాస్తున్న మోహన్ లాల్ అండ్ సన్

ఇన్ని బస్సుల ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాజీనామా చేస్తున్నారా..? అధికారులపై చర్యలు తీసుకుంటున్నారా..? అని కేఏపాల్ ప్రశ్నించారు. “దేశాన్ని రక్షించాలి. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికీ కేంద్రం కౌంటర్ వెయ్యలేదు.. Evmలను తీసేసి బ్యాలెట్ పేపర్ ను తీసుకురావాలి.. ఈవీఎంలు ఉన్నంత కాలం ఓడి పోతున్నాం.. నా పోరాటంలో చెయ్యి కలపాలని అందర్నీ కోరుతున్నా.. ఏపీలో నా ఛారిటీలపై పడుతున్నారు.. ఛారిటీలకు ట్యాక్స్ ఉండవు.. వచ్చేవారం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న.. నన్ను ఆపడం ఎవరి తరం కాదు.. నా జోలికి రావద్దు, శాపాలు పొందవద్దు.. ప్రపంచం మొత్తం నన్ను వాడుకుంటుంది.. తెలుగు రాష్ట్రాలకు మేలు చేస్తామంటే ముఖ్యమంత్రులు ముందుకు రావడం లేదు.. ప్రజాశాంతి పార్టీ పెట్టానని నాపై కేసులు పెడుతున్నారు..” అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version